సుప్రీం ను ఆశ్రయించిన తల్లీ కొడుకులు

Sonia-Rahul Petition In Supreme Court

12:25 PM ON 4th February, 2016 By Mirchi Vilas

Sonia-Rahul Petition In Supreme Court

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కింది కోర్టు సమన్లను హైకోర్టు సమర్థించడాన్ని సవాలుచేస్తూ సోనియా, రాహుల్‌ సుప్రీంకు వెళ్లారు. గత ఏడాది డిసెంబరులో డిల్లీ కోర్టు వీరిద్దరికీ ఈ కేసులో బెయిల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక ఆస్తులకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారని సోనియా, రాహుల్‌ తదితరులపై బిజెపి నేత డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి జనతా పార్టీ అధ్యక్షుడిగా వుండగా కేసు పెట్టారు. అయితే ప్రస్తుతం జనతా పార్టీని బిజెపిలో వీలినం చేసి, ఆపార్టీలో కొనసాగుతున్నారు. అసలు పాటియాలా కోర్టుకి హాజరు కాకుండా ఉండేందుకు మినహాయింపు కోరినా ఫలితం లేకపోవడంతో, చివరకు కోర్టు మెట్లు ఎక్కిన సోనియా , రాహుల్ బెయిల్ పొందారు. ఇప్పుడు ఏకంగా సుప్రీంను ఆశ్రయించారు.

English summary

All India Congress Committee President And Vice President Sonia And Rahul Gandhi filed a petition on Supreme Court in National Herald Case.Sonia and Rahul opposed the notices that have given by Patilala Court