మఠంలో సోనియమ్మ

Sonia Visits Sivagiri Matam In Kerala

07:28 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Sonia Visits  Sivagiri Matam In Kerala

ఇటీవల నేషనల్ హెరాల్డ్ కేసులో కోర్టు మెట్లు ఎక్కిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆధ్యాత్మిక చింతన వైపు మొగ్గుతున్నారా? అవుననే సమాధానం వచ్చే విధంగా ఆమె కేరళలోని వర్కళలోని శివగిరి మఠాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట కేరళ సీఎం వూమెన్‌ చాందీ వున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గురువు శ్రీ నారాయణ గురు చిత్రపటాన్ని శివగిరి మఠం నిర్వాహకులు సోనియాగాంధీకి అందజేశారు. అనంతరం శివగిరి మఠంలో వార్షిక తీర్థయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కాగా కేరళ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి కేసీ జోసఫ్‌ అరుదైన కానుకగా 1925, మార్చి 13న మహాత్మాగాంధీ శివగిరి మఠంలో ప్రసంగానికి సంబంధించిన పత్రాలను ఆమెకు బహుకరించారు. ప్రఖ్యాతి పొందిన కేరళ శివగిరి మఠం సందర్శన వెనుక ప్రత్యేక కారణాలంటూ ఏమీ లేవని కాంగ్రెస్ వర్గాలు అంటున్నా, ఏదో కారణం వుండే ఉంటుందన్న మాటలు వినిపిస్తున్నాయి.

English summary

Congress Party President Sonia Gandhi Visits SivaGiri Matam In Kerala Today