50 సైకిళ్లు దానం చేసిన సోనూసూద్‌!!

Sonu Sood donated 50 cycles for gym boys

12:57 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

Sonu Sood donated 50 cycles for gym boys

రవిబాబు దర్శకత్వం వహించిన 'అమ్మాయిలు అబ్బాయిలు' చిత్రంతో తెలుగులో విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు సోనూసూద్‌. ఆ తరువాత పూరీజగన్నాధ్‌ దర్శకత్వం వహించిన సూపర్‌ చిత్రంలో నాగార్జున స్నేహితుడిగా నటించి ఫేమస్‌ అయ్యాడు. ఆ తరువాత పూరీ జగన్నాధ్‌, త్రివిక్రమ్‌ రూపిందించిన ఎన్నో చిత్రాల్లో విలన్‌గా మెరిశాడు. టాలీవుడ్‌లాగే బాలీవుడ్‌లో కూడా విలన్‌గా అదరగొట్టాడు. సల్మాన్‌ నటించిన సూపర్‌హిట్‌ 'దబాంగ్‌' చిత్రంలో విలన్‌ అంటే ఇలా కూడా ఉంటారా అన్నట్లు నటించి అందరీ ప్రశంసలు పొందాడు. అయితే ఈ చిత్రంతోనే సోనూసూద్‌కి దాతృత్వం కూడా పుట్టుకొచ్చింది.

దబాంగ్‌ రిలీజ్‌ సమయంలో సల్మాన్‌ కొంత మంది వీధి బాలలకు సైకిళ్లు దానం చేశాడు. ఇప్పుడు సోనూసూద్‌ కూడా సల్మాన్‌ఖాన్‌ ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో సోనూసూద్‌ సొంత గ్రామమైన మోఘలో తన పర్సనల్‌ జిమ్‌లో నిత్యం కసరత్తులు చేస్తున్న 50 మంది జిమ్‌ బాయ్స్‌కి సైకిళ్లు కొనిచ్చాడు. అంతే కాకుండా మీరెప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే సైకిల్‌ తొక్కండి ఆరోగ్యంగా ఉండండి, ఫిట్‌నెస్‌ని కాపాడుకొండి అంటూ ప్రచారం చేస్తున్నాడు. సాధ్యమైనంత వరకు టూ వీలర్‌ విడిచి పెట్టి ఇలా సైకిల్ తొక్కండి అంటూ ఆరోగ్య సూక్తులు చెప్తున్నాడు.

English summary

Sonu Sood donated 50 cycles for gym boys. Sonu Sood inspired by bollywood hero Salman Khan when Dabaang release time and now he donated 50 cycles to his gym boys.