సోనీ నుంచి హెచ్‌ఎక్స్80 డిజిటల్ క్యామ్..

Sony Launched HX80 Digital Camera

06:36 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Sony Launched HX80 Digital Camera

ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ సోనీ మరో కొత్త డిజిటల్ కెమెరాను విడుదల చేసింది. డీఎస్‌సీ-హెచ్‌ఎక్స్80 పేరిట ఈ డిజిటల్ కెమెరాను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.23,500. ఏప్రిల్ లో ఈ కెమెరా వినియోగదారులకు లభ్యం కానుంది. 18.2 మెగాపిక్సల్ కెమెరా సెన్సార్, 3 ఇంచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, హెచ్‌డీ వీడియో రికార్డింగ్ మొదలైన ఫీచర్లు ఈ కెమెరాలో ఉన్నాయి. 10ఎఫ్‌పీఎస్ స్పీడ్‌తో బరస్ట్ షూటింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఎక్కువగా పర్యటనలకు వెళ్లే వారి కోసం తమ తీపి గుర్తులను ఫొటోలను తీసుకునేందుకు వీలుగా ఈ కెమెరాను రూపొందించినట్టు సోనీ తెలిపింది.

English summary

Worlds Famous electronics company Sony Launched a new camera called Sony HX80 .The price of this camera was roughly Rs. 23,500.It comes with the key features like 18.2-megapixel Exmor R CMOS sensor ,Wifi and NFC