సోనీ నుంచి వాక్‌మన్ ఎన్‌డబ్ల్యూ-ఎ25 వాక్‌మన్

Sony Launches Audio Walkman NW-A25

12:57 PM ON 11th February, 2016 By Mirchi Vilas

Sony Launches Audio Walkman NW-A25

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ సంస్థ సోనీ ఓ నూతన హై రిజల్యూషన్ ఆడియో ప్లేయర్‌ను రిలీజ్ చేయనుంది. వాక్‌మన్ ఎన్‌డబ్ల్యూ-ఎ25 పేరిట ఈ వాక్ మన్ ను అతి త్వరలో భారత మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. రూ. 13,990ధరకు ఈ ఆడియో ప్లేయర్ వినియోగదారులకు లభ్యం కానుంది. 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 2.2 ఇంచ్ టీఎఫ్‌టీ ఎల్‌ఈడీ స్క్రీన్, ఎఫ్‌ఎం రేడియో వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. MP3, WAV, AIFF, WMA, AAC, HE-AAC, FLAC, APPLE LOSSLESS వంటి ఆడియో ఫార్మాట్‌లను ఈ ప్లేయర్ సపోర్ట్ చేస్తుంది. డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్‌బీ 2.0, బ్లూటూత్ 3.0 కనెక్టివిటీని ఇందులో అందిస్తున్నారు. దీనికి డిఫాల్ట్‌గా అత్యుత్తుమ క్వాలిటీ కలిగిన హెడ్‌సెట్‌ను ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్లేయర్‌లో DSEE-HX, CLEARAUDIO+ వంటి సౌండ్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఉండే ఇన్‌బిల్ట్ బ్యాటరీ ద్వారా 30 గంటల పాటు నాన్‌స్టాప్‌గా మ్యూజిక్ ప్లే బ్యాక్‌ను ఆస్వాదించవచ్చు.

English summary

World Famous Electronics Company Sony Launches a new High-Resolution Audio Walkman NW-A25.The price of this Audio Walkman was Rs. 13,990.This walkman was available in Black, Blue, Pink, Red, and Yellow colors