సోనీ నుంచి మూడు ఎక్స్‌పీరియా స్మార్ట్ ఫోన్లు

Sony Launches Three Xperia Smartphones

06:55 PM ON 26th February, 2016 By Mirchi Vilas

Sony Launches Three Xperia Smartphones

ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ సోనీ తాజాగా రెండు స్మార్ట్ ఫోన్లు రిలీజ్ చేసింది. ఎక్స్‌పీరియా సిరీస్ లో ఎక్స్, ఎక్స్‌ఏ, ఎక్స్ పెర్ఫార్మెన్స్‌ల పేరిట మూడు నూతన స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016లో ఎక్స్‌పీరియా ఎక్స్, ఎక్స్‌ఏ డివైస్‌ల ధరలను సోనీ వెల్లడించింది. ఎక్స్‌పీరియా ఎక్స్ ధర రూ.41 వేలు. ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ ధర రూ.20,500. ఈ రెండు ఫోన్లు త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా యూజర్లకు లభ్యం కానున్నాయి. అయితే ఎక్స్ పెర్‌ఫార్మెన్స్ డివైస్ ధరను త్వరలో వెల్లడించనుంది.

ఎక్స్‌పీరియా ఎక్స్ ఫీచర్లు ఇవే..

5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ట్రై ల్యూమినస్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 23 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

200 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 4జీ ఎల్‌టీఈ, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 650 ప్రాసెసర్, 2620 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, సింగిల్/డ్యుయల్ సిమ్ మాడ్యూల్స్

ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ ఫీచర్లు ఇవే..

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, మీడియాటెక్ ఎంటీ6755 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, సింగిల్/డ్యుయల్ సిమ్ మాడ్యూల్స్

English summary

Sony company launches three new smartphones in its Xeperia series named Sony Xperia X, Xperia XA, Xperia X .