సోనీ.. సూపర్ బ్యాటరీ

Sony to make Super phone battery

06:51 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Sony  to make Super phone battery

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో వినియోగదారుల అవసరాల మేరకు శక్తిమంతమైన బ్యాటరీల తయారీ మొబైల్ ఫోన్ తయారీ సంస్థలకు కష్టంగా మారింది. నెట్ వినియోగం పెరిగడంతో ఒక రోజుకు సరిపడా బ్యాటరీ చార్జింగ్ ఉంచడం సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ సోనీ ఓ సరికొత్త సూపర్ బ్యాటరీని ఆవిష్కరించింది. సాంప్రదాయ లిథియం అయాన్ బ్యాటరీల కంటే 40 శాతం ఎక్కువ శక్తిని ఈ బ్యాటరీలో నిల్వచేయొచ్చని సోనీ ప్రకటించింది. ఈ బ్యాటరీల తయారీలో లిథియం- సల్ఫర్, మెగ్నీషియం-సల్ఫర్ మూలకాలను వాడినట్లు తెలిపింది. కొత్త విధానం ద్వారా బ్యాటరీలో తక్కువ స్థలంలో ఎక్కువ శక్తిని నిల్వచేసే అవకాశం ఉందని తెలిపిన సోనీ... ఇవి పూర్తి స్థాయిలో వినియోగదారులకు అందుబాటులోకి రావాలంటే మాత్రం 2020 వరకు ఆగాల్సిందే అని చెబుతోంది. గతంలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో కూడా సోనీ సంస్థ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

English summary

At present Sony Company is working on a new type of battery technology that promises to increase the energy density of today’s standard lithium-ion batteries by a whopping 40%.