'జియాఖాన్' ప్రియుడు మరో అమ్మాయితో డేటింగ్

Sooraj Pancholi dating with another girl

04:26 PM ON 30th January, 2016 By Mirchi Vilas

Sooraj Pancholi dating with another girl

వివాదాస్పద నటుడు సూరజ్‌ పంచోలి మళ్ళీ ప్రేమలో పడినట్టున్నాడు. గతంలో సూరజ్‌ పంచోలీ జియాఖాన్‌ తో సహజీవనం చేశాడు. జియాఖాన్‌ అనుమాదాస్పద మరణంతో అందరూ షాక్‌ తిన్నారు. ఆమె ఆత్మహత్య కేసు ఇంకా పరిష్కారం అవ్వలేదు. ఆమె నిజంగా ఆత్మహత్య చేసుకుందా లేదంటే ఎవరైనా ఆమెను హత్య చేసారా అనే విషయం పై విచారణలు కొనసాగుతున్నాయి. విచారణ సమయంలో సూరజ్‌ను నిందితుడిగా అరెస్ట్‌ చేసి కొన్ని రోజులు జైలులో కూడా ఉంచారు. ఈ సంఘటన నుంచి సల్మాన్‌ఖాన్‌ ఇతని మొదటి సినిమాకి నిర్మాతగా ఉండి సూరజ్‌ను ఆ సంఘటన నుండి బయటకు తీసుకువచ్చాడు.

బాలీవుడ్‌ లో విజయం సాధించడంతో సూరజ్‌ గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాడు. సూరజ్‌ ఒక అమ్మాయితో మీడియా కంట పడ్డాడు. వీరిద్దరూ ఒక రెస్టారెంట్‌ నుంచి బయటకు వచ్చేటప్పుడు మీడియా కంట్లో పడ్డారు. అక్కడ మీడియా వాళ్ళని చూడడంతో వాళ్ళిదరూ ఆశ్యర్యపోయారు. ఆ అమ్మాయి త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్లో కూర్చుంది. దీంతో ఆ అమ్మాయి ముఖం సరిగ్గా కనపడలేదు. ఆ అమ్మాయి తన ముఖం ఫోటోలో పడకుండా చెయ్యి అడ్డుపెట్టుకుంది. కానీ మీడియా వాళ్ళు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి ఫోటోలు తీసారు.

సూరజ్‌ తో సహజీవనం చేస్తున్న ఈ అనుమానాస్పద యువతి ఎవరో ఒకసారి చూడండి. మామూలు స్నేహితురాలు అయితే అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ముఖాన్ని ఎందుకు దాచుకుంటుంది.

English summary

Bollywood heroine Jiah Khan(late) lover Sooraj Pancholi dating with another girl. Both caught for camera at restaurant.