ఒంగోలులో 'సౌఖ్యం' టీమ్ కు ఏం పని?

soukhyam audio release in ongole on december 13

06:09 PM ON 21st November, 2015 By Mirchi Vilas

soukhyam audio release in ongole on december 13

జిల్ చిత్రం తరువాత గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం 'సౌఖ్యం'. గోపీచంద్ ఎ.ఎస్. రవికుమార్ చౌదరి కాంబినేషన్లో వచ్చిన 'యజ్ఞం' చిత్రం ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రమే గోపీచంద్‌ని హీరోగా నిలబెట్టింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో పదకొండు సంవత్సరాలు తరువాత వస్తున్న చిత్రం సౌఖ్యం. గోపీచంద్ సరసన రెజీనా మొదటిసారి నటిస్తోంది. దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ ప్రతీ వ్యక్తి తన కుటుంబం సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటాడు. మా చిత్రంలో హీరో తన కుటుంబంతో పాటు చుట్టుప్రక్కల వారు కూడా సౌఖ్యంగా ఉండాలనుకునే పాత్రలో అల్లుకున్న కథే సౌఖ్యం అని అన్నారు.

భవ్య క్రియేషన్స్ పతాకం పై వి. ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియోని ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ప్రాంతంలో డిసెంబర్ 13న విడుదల చెయ్యాలని సన్నాహాలు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సౌఖ్యం టాకీ భాగం, మూడు పాటలు కూడా చిత్రీకరణ జరిగిపోయింది. ఇంకా రెండు పాటలు షూటింగ్ జరగాల్సి ఉంది. ఈ చిత్రానికి 'అనూప్ రూబెన్స్' సంగీతాన్ని సమకూర్చారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

English summary

soukhyam audio release in ongole on december 13