ఒక రోజు ముందుకొచ్చిన 'సౌఖ్యం'

Soukhyam movie relase pre-poned

12:55 PM ON 17th December, 2015 By Mirchi Vilas

Soukhyam movie relase pre-poned

లౌక్యం, జిల్‌ వంటి వరుస హిట్స్‌ తో దూసుకుపోతున్న మాచో హీరో గోపిచంద్‌ తాజాగా నటించిన చిత్రం 'సౌఖ్యం'. గోపిచంద్‌ని హీరోగా నిలబెట్టిన 'యజ్ఞం' సినిమాని తెరకెక్కించిన ఎ.ఎస్‌. రవికుమార్‌ చౌదరి సౌఖ్యం చిత్రానికి దర్శకత్వం వహించారు. భవ్య క్రియేషన్స్‌ సంస్ధ నిర్మించిన ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25 న విడుదల చేయనున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పడు ఒక రోజు ముందుకు విడుదలని ప్రీ-పోన్‌ చేశారు. కారణాలు తెలీదు కానీ డిసెంబర్‌ 24న 'సౌఖ్యం' చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇప్పుటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌తో పాజిటీవ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం ఏ విధంగా ప్రేక్షకులని అలరిస్తుందో చూడాలి. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలో గోపిచంద్‌ సరసన రెజీనా కాసండ్ర హీరోయిన్‌గా నటించింది.

English summary

Soukhyam movie relase pre-poned to December 24th.