సౌందర్య చనిపోతుందని వాళ్ళ తండ్రికి ముందే తెలుసా?

Soundarya father knows about her death

11:46 AM ON 18th April, 2016 By Mirchi Vilas

Soundarya father knows about her death

టాలీవుడ్ లోనే కాదు... మిగిలిన భాషా చిత్రాల్లో కూడా తన నటనతో జనాన్ని కట్టిపడేసిన అందాల నటి సౌందర్య ప్రమాదంలో మరణించినా, అప్పడప్పుడు ఆమె గురించి వార్తలు వస్తూనే వున్నాయి. తాజాగా ఆమె మరణం వెనుక ఓ మిస్టరీ వెలుగు చూసింది. టాప్ హీరోయిన్ గా 10 ఏళ్ళ పాటు తెలుగు సినీ ఇండస్ట్రీ ని ఏలిన సౌందర్య ఎన్నికల ప్రచారానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైంది. దాదాపు 12 ఏళ్ళ క్రితం ఆమె మరణించినా ఇంకా ఆమె జ్ఞాపకాలు చాలా మందిని వెంటాడుతూనే ఉన్నాయి. సౌందర్య మరణం గురించి ఆమె తల్లిదండ్రులకు ముందే తెలుసట.

ఆమె తండ్రి సత్యనారాయణకు జాతకాల మీద బోల్డంత పట్టు ఉందట. అలాగే సౌందర్య జాతకం చూసాడట. ఇండస్ట్రీలో సొందర్య హై పొజిషన్ కి వెళ్తుందని అయితే 2004లో ఆమె కెరీర్ ముగుస్తుందని జ్యోతిషం చూసాడట. అయితే కెరీర్ కాదు ఆమె జీవితమే ముగిసిపోయింది. అంటే ఆ రకంగా ఆమె మరణం గురించి ముందే తెల్సిందన్న మాట. 2004 ఏప్రిల్ 17 మధ్యాహ్నం 1.14 గంటలకు ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో హీరోయిన్ సౌందర్య దుర్మరణం పాలైంది.

English summary

Soundarya father knows about her death. Soundarya father knows about horoscope, and he knows that she will die.