విడాకులకు అప్లై చేసిన రజనీకాంత్ కూతురు?

Soundarya Rajinikanth applied for divorce in family court

04:24 PM ON 16th September, 2016 By Mirchi Vilas

Soundarya Rajinikanth applied for divorce in family court

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య విడాకులు తీసుకుంటోందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. హ్యాపీగా వున్న సౌందర్య లైఫ్ లో ఏం జరిగింది? విడాకులు అప్లై చేయడానికి కారణాలేంటి? ఇంకా లోతుల్లోకి వెళ్తే.. చెన్నైకి చెందిన యువ వ్యాపారవేత్త అశ్విన్ కుమార్ తో రజనీకాంత్ కూతురు సౌందర్యకు ఆరేళ్ల కిందట పెళ్లి జరిగింది. మరి ఈ యువజంట మధ్య ఏం జరిగిందో కారణాలు తెలీదుగానీ, ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోరుతూ సౌందర్య పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

ప్రస్తుతం ఆమె భర్త అశ్విన్ కిడ్నీ ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లినట్లు తెలిసింది. అక్కడి నుంచి రాగానే.. ఇద్దరూ ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకుంటారనేది చెన్నై మీడియా కథనం. సౌందర్య- అశ్విన్ కుమార్ ల పెళ్లి ఆరేళ్ల కిందట చెన్నైలో ఘనంగా జరిగింది. కొద్దిరోజుల కిందట కోలీవుడ్ లోకి అడుగుపెట్టిన సౌందర్య, సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ని ఏర్పాటు చేసింది. రజనీకాంత్ హీరోగా కొచ్చాడయాన్ మూవీని ఆమె డైరెక్ట్ చేసిన విషయం తెల్సిందే!

ఇది కూడా చదవండి: మీరు ఎందులోనూ విజయం సాధించలేకపోతున్నారా? అయితే మీ ఇంట్లో ఇవి ఉన్నాయేమో చూడండి

ఇది కూడా చదవండి: ఇంట్లో వాళ్లంతా ఆరోగ్యంగా ఉండాలంటే నెలకోసారి ఈ అన్నం తింటే చాలు!

ఇది కూడా చదవండి: సెక్స్ పార్టీలకు అడ్డాగా మారిన కాలేజీ ఇదే!

English summary

Soundarya Rajinikanth applied for divorce in family court. South Indian Super Star Rajinikanth's younger daughter Soundarya Rajinikanth married a businessman Ashiwn Kumar before 6 years ago.