ధోనీ ఒత్తిడిలో ఉన్నా తెలియదు: దాదా

Sourav Ganguly About Dhoni

10:42 AM ON 4th February, 2016 By Mirchi Vilas

Sourav Ganguly About Dhoni

టీమిండియా వన్డే, టీ20 సారధి మహేంద్ర సింగ్‌ ధోని ఎంత ఒత్తిడిలో ఉన్నా.. బయటికి మాత్రం ప్రశాంతంగా కనబడతాడని, అసలు అతనిపై ఒత్తిడి ఉందనే విషయాన్నే కనబడనీయడని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌ గంగూలీ పేర్కొన్నాడు. కొంతకాలంగా ధోనీ కెప్టెన్సీ, ఆటతీరుపై వస్తున్న విమర్శలపై గంగూలీ స్పందిస్తూ ఓ జట్టు కెప్టెన్‌గా విమర్శలు, పొగడ్తలు రావడం సాధారణమని, అయితే విమర్శలను స్వీకరించడంలో ధోనీ పండిపోయాడని కితాబిచ్చాడు. మనం కేవలం విమర్శలనే ఎత్తి చూపుతున్నాం తప్ప ధోనీకి డ్రెస్సింగ్‌ రూములో సహచరులిచ్చే గౌరవం.. క్రికెట్‌ అభిమానులు చూపించే ఆదరణ వెలకట్టలేనిదన్నాడు. భారత్‌ జట్టుకు కోచ్‌గా వచ్చే ఆలోచన ప్రస్తుతానికి లేదని.. క్యాబ్‌ అధ్యక్షుడిగానే సరిపోతోందని వెల్లడించాడు. తన జీవిత చరిత్ర రాసేంత సమయం ప్రస్తుతం తన వద్ద లేదని వెల్లడించాడు.

English summary

Inida Ex-Captain Sourav Ganguly Says that Dhoni can handle pressure very well and he will not look like he was in pressure even he was in pressure.Ganguly also says No to India Coaching Role For Now.Presently Ganguly was currently the president of the Cricket Association of Bengal.