సచిన్ కు గంగూలీ వార్నింగ్

Sourav Ganguly's Warning to Sachin Tendulkar

05:40 PM ON 4th November, 2015 By Mirchi Vilas

Sourav Ganguly's Warning to Sachin Tendulkar

నవంబర్ 7న అమెరికాలో ప్రారంభం కాబోయే "అల్ స్టార్స్ టీ20 లీగ్ "కు సర్వం సిద్దం అయ్యింది. సచిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న సచిన్ బ్లాస్టర్స్ టీం తరఫున ఆడుతున్నాడు ఈ భారత మాజీ సారధి సౌరవ్ గంగూలీ. తనకు మ్యాచ్ లో ఓపెనర్ గా పంపకపోతే తను తరువాతి విమానం లో భారత్ తిరిగి వెళ్ళిపోతానని గంగూలీ చమత్కరించాడు.ఈ ఎడమ చేతి వాటం బాట్స్‌మెన్ మైదానం లో 30 నిమిషాల పాటు ప్రాక్టీసు చేసాడు. బౌలింగ్ దిగ్గజం షేన్ వార్న్ ప్రాతినిధ్యం వహిస్తున్న "వార్న్ వారియర్స్ " టీం ను సమర్ధంగా ఎదుర్కోవడానికి తాను సిద్దంగా వున్నానని గంగూలీ తెలిపాడు.

భారత మాజీ ఆటగాడు హైదరాబాద్ కు చెందిన వి.వి.ఎస్.లక్ష్మణ్ గురించి ప్రస్తావించగా (నవ్వుతూ)లక్ష్మణ్ కు అమెరికా వారు వీసా ఇంకా మంజూరు చేయ్యనందున ఆందోళనగా ఉన్నాడని త్వరలోనే వీసా తప్పక వస్తుందిలే అన్నాడట.


తనలో క్రికెట్ ఆడే సామర్ధ్యం ఇంకా ఎంతుందో మ్యాచ్ వరకు వేచి చూడండని గంగూలీ చెప్పుకొచ్చాడు.

English summary

Sourav Ganguly is playing for Sachin Tendulkars team Sachins Blasters in the All Stars T20 Series in the United States. Shane Warne is the captain of the other team. Three T20 matches will played, first game starting November 7