సౌతాఫ్రికా కొంపముంచిన అశ్విన్‌, జడేజా!!

South Africa all out in 3rd test 1st innings

01:09 PM ON 26th November, 2015 By Mirchi Vilas

South Africa all out in 3rd test 1st innings

నాగపూర్‌: భారత్‌- సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో సౌతాఫ్రికా పై భారత్‌ ఆధిపత్యం చెలాయిస్తుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన భారత్‌ 215 పరుగులకే ఆలౌట్‌యింది. తరువాత బ్యాటింగ్‌కి దిగిన సౌతాఫ్రికా ఆరంభంలోనే తడబడింది. అశ్విన్‌ 5, జడేజా 4 వికెట్లు తీసి సౌతాఫ్రికాని 79 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 11/2 తో రెండో రోజు ప్రారంభించిన సౌతాఫ్రికా లంచ్‌ బ్రేక్‌ వరకు కూడా నిలబడలేకపోయింది. ఒకరి తరువాత ఒకరు పెవిలియన్‌ చేరారు. ప్రస్తుతం భారత్‌ 136 పరుగులు ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన భారత్‌ వికెట్‌ కూడా నష్టపోకుండా 7/0 వద్ద లంచ్‌ బ్రేక్‌కి వెళ్లింది. విజయ్‌, దావన్‌ క్రీజ్లో ఉన్నారు.

English summary

South Africa all out in 3rd test 1st innings with 79 runs. India started 2nd innings without lossing a wicket.