ఓటమి అంచుల్లో సౌతాఫ్రికా!

South Africa in deep trouble

07:41 PM ON 4th December, 2015 By Mirchi Vilas

South Africa in deep trouble

ఢిల్లీ : ఫెరోజ్షా కోట్లాలో భారత్‌ - సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న నాల్గవ టెస్ట్‌ లో కూడా సౌతాఫ్రికా ఆటతీరు మారలేదు. తొలుత బ్యాటింగ్‌కి దిగిన భారత్‌ ఆరంభంలో తడబడినా ఆ తరువాత కెప్టెన్‌ కోహ్లీ, రహానే ఇన్నింగ్స్‌ని చక్క దిద్దారు. ఆ తరువాత కోహ్లీ ఔట్‌ అవ్వడంతో రోహిత్‌ (1), సాహా (1) వచ్చిన వెంటనే పెవిలియన్‌కు వెనుదిరిగారు. జడేజా కాసేవు మెరిసినా జడేజా కూడా ఔట్ అవ్వడంతో ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే భారం రహానే, అశ్విన్‌ల భుజాల పై పడింది. ఇందులో రహానే(127) సెంచరీతో చెలరేగగా అశ్విన్‌(56) అర్థ సెంచరీతో రహానేకి అండగా నిలిచాడు.

ఈ నేపధ్యంలో రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్‌ 334 పరుగులకే ఆలౌటయింది. ఆ తరువాత ఇన్నింగ్స్‌ని ఆరంభించిన సౌతాఫ్రికా విక్కెట్లను పేకమేడలా కూల్చుకుంది. ఒక్క డివిలియర్స్‌(42) తప్ప మిగతా ఎవరూ చెప్పుకో దగ్గ స్కోర్ చేయలేదు. దీనితో సౌతాఫ్రికా రెండో రోజు ఆట ముగిసేసరికి 121 పరుగులకే ఆలౌటుయింది.

English summary

South Africa is deep trouble in 4th test match against India.