రోడ్డెక్కిన అడవి రాజులు - ఎందుకో తెలుసా

South Africa Lions walks on Roads create traffic jam

04:54 PM ON 28th January, 2017 By Mirchi Vilas

South Africa Lions walks on Roads create traffic jam

అడవుల్లో ఉండాల్సిన సింహాలు రోడ్డెక్కాయి. అవును నిజం .. ఎక్కడంటే, దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్కులో ఇటీవల ఓ సంఘటన చోటు చేసుకుంది. పార్కు సందర్శించేందుకు వచ్చిన పలువురు రహదారిపై అడవిరాజుల గుంపును చూసి ఆశ్చర్యపోయారు. దీంతో సందర్శకుల వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. ఇంతకీ మృగరాజుల గుంపు రహదారిపైకి ఎందుకొచ్చిందో తెలుసా?

క్రూగర్ పార్కును సందర్శించేందుకు రోజూ ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో సుమారు 18సింహాల గుంపు రహదారిపై ఒక చోట అటు ఇటూ తిరుగుతూ పర్యాటకులకు కనిపించాయి. అన్ని సింహాలు ఒకే చోట ఎందుకు ఉన్నాయా అని వారంతా ఆసక్తిగా తిలకించారు. తీరా చూస్తే ఒక దున్నపోతును వేటాడి చంపిన సింహాల గుంపు దాన్ని ఆరగించేందుకు రోడ్డు మధ్యకు చేరింది. దున్నపోతు మృతదేహాన్ని పర్యాటకులు వెళ్లే రహదారిపైకి తీసుకువచ్చి తీరిగ్గా తినడం ప్రారంభించాయి.. ఈ సమయంలో అటుగా వచ్చిన పర్యాటకులు కొందరు తమ కార్లను పక్కనే నిలిపివేశారు.

పార్కు సందర్శనకు వచ్చిన 60ఏళ్ల సువాన్ రైట్ ఈ తతంగాన్నంతా వీడియో తీశాడు. రోడ్డు మధ్యలో సింహాల గుంపును గుర్తించిన పలువురు వాటిని దాటి వెళ్లే ధైర్యం చేయలేకపోయారని, దీంతో ఎన్నో వాహనాలు నిలిచిపోయాయని తెలిపారు.

ఇది కూడా చూడండి: మహాభారత అశ్వత్థామ… ఇప్పటికీ ఆ ప్రాంతంలో తిరుగుతున్నాడా?

ఇది కూడా చూడండి: మీ అర చేతిలో ఇలాంటి గుర్తు ఉంటె మీకు తిరుగులేదు

English summary

South Africa Kruger National Park Lions walks on roads creates traffic jam. people get shocked by observing this incident.