ఇక్కడ టాప్ హీరోయిన్లే ... అక్కడ జీరోయిన్లు అవుతున్నారు

South Heroines Who Failed in Bollywood

12:33 PM ON 11th July, 2016 By Mirchi Vilas

South Heroines Who Failed in Bollywood

అది ఆటైనా పాటైనా మరొకటైనా ఓ చోట గెలిస్తే, మరో చోట సత్తా చూపాలని ఉవ్విళ్ళూరుతాం ... అంతెందుకు, రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడినవాళ్లు.. కచ్చితంగా ఇంటర్నేషేనల్ మ్యాచ్ ఆడాలని కోరుకుంటారు. అది అత్యాశ కాదు. ఆశ మాత్రమే. అసలు అలాంటి ఆశ లేకుంటే ముందుకు వెళ్లలేం. ఇక స్టార్స్ విషయానికి వస్తే , దక్షిణాదిన రాణించిన ముద్దుగుమ్మలు ఒక్కసారైనా బాలీవుడ్ లో తళుక్కుమనాలని అనుకుంటారు. అదృష్టం కల్సి వస్తే, బాలీవుడ్ లో కూడా శ్రీదేవి , జయప్రద తదితరుల మాదిరిగా ఓ వెలుగు వెలిగిపోతారు. అయితే ఇటీవల దక్షిణాది నుంచి బాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరోయిన్లకు ఎందుకో కాలం కలసి రావడం లేదు.గోడకు గొట్టిన బంతిలా అలా వెళ్లి, ఇలా వచ్చేయడం తప్ప, పట్టుమని పది సినిమాలు చేసినవాళ్లు అస్సలు లేరు. ఒక వేళ కొద్దోగొప్పో అవకాశాల్ని చేజిక్కించుకొన్నా, అక్కడ పాపులారిటీ సంపాదించు కోలేకపోతున్నారు. అందుకే ఇక్కడ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన వాళ్లు, హిందీ సీమలో జీరోయిన్లుగా మిగిలిపోతున్నారు. అలాంటి వాళ్లలో కొందరు...

1/6 Pages

పాపం కాజల్ ...

మొన్నటికి మొన్న ‘దో లఫ్జోంకీ కహానీ’ అనే సినిమా చేసిన కాజల్ తన కెరీర్ లో ఎప్పుడూ చేయని అంధురాలి పాత్ర పోషించి కాస్త సాహసానికి ఒడిగట్టింది. అయినా కాజల్ ని అక్కడ పట్టించుకొన్నవాళ్లు లేరు. ‘కాజల్ లిప్ లాక్ ’ గురించి మాట్లాడుకొన్నంత కూడా ఆమె నటన గురించి చెప్పుకోలేదంటే, పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ చెప్పక్కర్లేదు. కాజల్ మరీ అంత బ్యాడ్ గా ఏం నటించలేదు. ఆమె నటన బానే ఉందని విమర్శకులు చెప్పినప్పటికీ, ప్రేక్షకులకు మాత్రం అలాంటి ఒక్క మాట కూడా అన్న దాఖలాలు లేవు. కాజల్ కాదు, చాలామంది దక్షిణాది భామలది ఇదే దుస్థితి.

English summary

South Indian Heroines Who Failed in Bollywood.