నైరుతి రుతుపవనాలు తాకాయి

Southwest monsoon hits Kerala

01:28 PM ON 8th June, 2016 By Mirchi Vilas

Southwest monsoon hits Kerala

నిన్న మొన్నటి వరకూ ప్రచండ భానుడి ప్రతాపంతో అల్లాడిన ప్రజలకు గత రెండు మూడు రోజులుగా పడుతున్న వర్షాలు సేద తీరుస్తున్నాయి. అయితే ఇప్పుడు వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగానే నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాలు బుధవారం కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణశాఖ ప్రకటించింది. దక్షిణ అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించిన రుతు పవనాలు మాల్దీవ్, కొమరిన్ తోపాటు దక్షిణ బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తూ కేరళలో ప్రవేశించాయి. రుతుపవనాల రాకతో కేరళలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది. మరో ఐదు రోజుల్లో రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకనున్నాయి. మొత్తానికి ఈసారి వర్షాలు ఎక్కువాగానే ఉంటాయని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:అమరావతిలో అణుబాంబుల తయారీ - పాకిస్తాన్ రూమర్లు

ఇవి కూడా చదవండి:బీహార్ ఇంటర్ టాపర్స్ పై కేసులు

English summary

Southwest monsoon hits Kerala and they will hits Telugu States within five days this was said by Weather forecast department.