సోయా.. తింటే మగాళ్లకు పెద్ద డామేజి ?

Soya...Severy effects the Gents hormones?

10:59 AM ON 29th December, 2016 By Mirchi Vilas

Soya...Severy effects the Gents hormones?

కొన్ని కూరలు తింటే మంచిదని, ఫలానా జబ్బులు పోతాయని, జబ్బులు రాకుండా వుంటాయని పరిశోధనల్లో తేల్చినట్లు వార్తలు వస్తుంటాయి. అయితే సోయా తింటే చాలా పెద్ద డామేజి జరుగుతుందట. ఎక్కడో ఈస్ట్ ఆసియాలో పుట్టిన చిక్కుడు జాతికి చెందిన మొక్క ఇది. పాలకూ, మాంసాహారానికీ ప్రత్యామ్నాయంగా సోయా మారింది. ఇదివరకు ఆవు పాలకున్న గిరాకీ తగ్గింది. సోయా మిల్క్ కు డిమాండ్ పెరిగింది. మోడరన్ డేస్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సోయా... ఫస్ట్ ప్రయార్టీ ఇస్తున్న ఫుడ్ ఇది. దీంతో చేసినది ఏదైనా బేఫికర్ గా తినొచ్చని, సోయా మిల్క్ తాగితే మంచిదని, సోయాతో చేసిన స్వీట్లు డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినొచ్చని చెబుతున్నారు.. కానీ...ఫెర్టిలిటీ ఎక్స్ పర్ట్స్ ఇస్తున్న చిన్న వార్నింగ్ ఏంటంటే... సోయాలో ఉండే కెమికల్స్ తో మీరు తండ్రి కావడం కష్టమేనంటున్నారు.

సోయాతో చేసిన ఫుడ్ ప్రోడక్ట్స్ ఇష్టంగా తినేవాళ్లకిది కొద్దిగ కష్టంగా అనిపించినా ఇది నిజం అంటున్నాయి రీసెర్చ్ ఫలితాలు. అతిగా సోయా వాడే పురుషుల్లో తండ్రి అయ్యే అవకాశాలు తగ్గిపోయినట్టు గమనించారు సైంటిస్టులు. సోయాతో తయారుచేసే నాన్ వెజ్, వెజ్ వంటకాలు ఎక్కువగా తీసుకోవడం దీనిలో వుండే రసాయనిక పదార్ధం వల్ల వీర్యం డామేజ్ అవుతుందంటున్నాయి తాజా పరిశోధనలు. దీనికి సంబంధించి 25 మంది వాలంటీర్ల డైటింగ్ హాబిట్స్ పై రెండేళ్లపాటు జరిపిన రీసెర్చ్ లో వీర్యానికి హాని కలిగించే ఫైటోఈస్ట్రోజెన్స్ అనే కెమికల్స్ సోయాలో ఉన్నట్టు తేలింది.అతిగా సోయా వాడటం వల్ల వీర్య కణాల చలన వేగం తగ్గిపోవడం తో బాటుక్రోమోజోముల పెరుగుదల నిష్పత్తి క్రమం లేకుండా పెరిగేందుకు కారణమౌతాయని డాక్టర్లు చెబుతున్నారు. మొత్తానికి ఏది తినాలో ఏది తినకూడదు తెలీని వింత పరిస్థితులు నడుస్తున్నాయి.

ఇది కూడా చదవండి: కాశీ తాళ్లు వెనుక అసలు రహస్యం ఇదే

ఇది కూడా చదవండి: వారెవ్వా, గౌతమి పుత్ర పాటలు ఇలా తీసారా?

ఇది కూడా చదవండి: ఈ ఈ రాసుల వాళ్ళు వివాహం చేసుకోకూడదట

English summary

Soya beans became very popular.The usage is increasing day by day. They replaced many foods items but nutritiones are a not supporting the use of Soya.