ఉపగ్రహాల్ని తరలించే 'బాహుబలి'

Space shuttle That Carries Satellites

10:13 AM ON 4th February, 2016 By Mirchi Vilas

Space shuttle That Carries Satellites

ఈ మధ్య బాహుబలి ఫీవర్ బానే పెరిగింది. అన్నింటికీ అన్వయించడానికి కూడా వీలుగా వుంది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్‌ ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ రూపొందిస్తోంది. . నాసా ఈ రాకెట్‌ను 2018లో ఆవిష్కరిస్తుందట. ఒక మానవ రహిత వ్యోమనౌకతోపాటు 13 చిన్నస్థాయి ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి మోసుకెళ్లే సామర్థ్యం దీని కి వుంది. భవిష్యత్తులో అంగారకుడితోపాటు, సుదూర అంతరిక్షంలో అన్వేషణకు మార్గం సుగమం అవుతుందని భావించే దీని విశేషాలు ఎన్నో ఉన్నాయి. మునుపెన్నడూ లేని స్థాయిలో నిర్మించిన స్పేస్‌లాంచ్‌సిస్టం(ఎస్‌ఎల్‌ఎస్‌) తొలి ప్రయాణంలో 13 క్యూబ్‌శాట్‌ ఉపగ్రహాల్నీ, ఒక ఓరియన్‌ వ్యోమనౌకను తీసుకెళ్తుంది. దీనిని ఎక్స్‌ప్లొరేషన్‌ మిషన్‌-1(ఈఎం-1)గా వ్యవహరిస్తున్నారు. 'ఇది మన వైజ్ఞానిక, సాంకేతక అనుసంధానతకు, అంగారకుడిపైకి ప్రయాణంలో ముందడుగుకు నిదర్శనం' అని నాసా డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్‌ డావా న్యూమాన్‌ వ్యాఖ్యానించారు. 13 క్యూబ్‌శాట్లు అంతరిక్ష చిత్రాలు తీస్తాయి. బయోసెంటినెల్‌ క్యూబ్‌శాట్‌ ఈస్ట్‌ ద్వారా సుదూర అంతరిక్షంలో సజీవ ప్రాణులపై రేడియో ధార్మిక ప్రభావాన్ని గణిస్తుందని నాసా తెలిపింది. లూనార్‌ ఫ్లాష్‌లైట్‌ మంచు నిల్వల కోసం వెతుకుతుందట. మొత్తానికి ఈ నాసా బాహుబలి ప్రత్యేకతలే వేరు కదా.

English summary

A new Space Shuttle was inventing by NASA that can carry 13 satellites into the Space.This Big Space Shuttle was going to be launch in 2018.