స్పెయిన్ ప్రధానికి టీనేజర్ పంచ్

Spain Prime Minister Was Punched By Teenager

04:37 PM ON 17th December, 2015 By Mirchi Vilas

Spain Prime Minister Was Punched By Teenager

ఎన్నికల ప్రచారం సందర్భంగా స్పెయిన్ ప్రధానమంత్రి మారియానో రాజోయ్‌కు చేదుఅనుభవం ఎదురైంది. ఓ యువకుడు ప్రధాని ముఖంపై పంచ్ విసిరాడు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. గలిషియా ప్రాంతంలోని పాంటివెడ్రా నగరంలోని ఓ వీధిలో ప్రధాని రాజోయ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో 17 ఏళ్ల యువకుడు దాడికి పాల్పడ్డాడు. చాలా సేపు ప్రధాని పక్కనే నిలుచున్న ఆ టీనేజర్ తన ఎడమ చేతితో రాజోయ్ ముఖంపై పంచ్ విసిరాడు. కుర్రాడి పంచ్‌కు ప్రధాని కింద కూలబోయారు. అయితే అక్కడే ఉన్న మిగతా జనం ప్రధానిని తూలకుండా పట్టుకున్నారు. టీనేజర్ దెబ్బకు ప్రధాని ఎడమ చెంప కందిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆదివారం స్పెయిన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. రాజోయ్‌కి చెందిన పీపుల్స్ పార్టీనే విజయం సాధిస్తుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే దాడికి దిగిన యువకుడిని పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. కాగా, రాజోయ్ పై టీనేజర్ పంచ్ కు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

English summary

Spain Primenister Mariano Rajoy was punched by a teenager during a campaign event