'స్పెయిన్‌' టీవీ ఛానల్లో ఎన్టీఆర్‌!

Spain tv channel interviews Ntr

06:34 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Spain tv channel interviews Ntr

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న 25 వ చిత్రం 'నాన్నకు ప్రేమతో'. క్రియేటివ్‌ డైరెక్టర్ సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుపుకుంటుంది. నిన్నటి తో స్పెయిన్‌లో షూటింగ్‌ పూర్తి చేసుకోవడంతో ఆ సందర్భంగా షూటింగ్‌ లొకేషన్‌కి వచ్చిన ఒక స్పెయిన్‌ టీవీ ఛానల్‌ 'నాన్నకు ప్రేమతో' టీమ్‌ తో ఇంటర్వ్యూచేసింది. హీరో ఎన్టీఆర్‌, డైరెక్టర్‌ సుకుమార్‌, హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తో టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూ చాలా సరదాగా సాగింది.

ఇవి కూడా చదవండి !!

'ఎన్టీఆర్‌' ఎకౌంట్‌ హ్యాక్‌ చేసేశారు!!

రాజమౌళికి ఇష్టమైన హీరో అతనే..

కన్నడంలో పాడనున్న యంగ్‌ టైగర్‌

'ఎన్టీఆర్‌' బాలీవుడ్‌ బ్యూటీతో రొమాన్స్ చేస్తాడా?

ఈ ఇంటర్వ్యూ టెలీకాస్ట్‌ చేసిన స్పెయిన్‌ ఛానల్‌ ఆ వీడియోని కూడా విడుదల చేసింది. ఆ వీడియోని చూసిన ఎన్టీఆర్‌ అభిమానులు ఇదో గొప్ప విషయంగా భావిస్తున్నారు. మా అభిమాన నటుడు స్పెయిన్‌ టీవీ ఛానల్‌లో హల్‌చల్‌ చేస్తున్నాడని ఎగిరి గంతేస్తున్నారు. జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని సన్నాహాలు చేస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.


English summary

Spain tv channel interviews Ntr in Nannaku Prematho shooting location.