బుల్ కుమ్మిన కుమ్ముడికి ఫైటర్ ప్రాణం పోయింది

Spanish bullfighter Victor Barrio Dead

10:59 AM ON 11th July, 2016 By Mirchi Vilas

Spanish bullfighter Victor Barrio Dead

అవునా అంటే, అవును మరి. రోజులు అన్నీ ఒకేలా ఉండవ్. అన్నివేళలా గెలుపు రాదు అని అంటారు కదా అదే నిజమైంది ఇక్కడ. 29 ఏళ్ళ విక్టర్ బారియో కు స్పెయిన్ లో బుల్ ఫైటర్ గా మంచి పేరుంది. గతంలో ఎన్నోసార్లు బుల్స్ తో ఫైట్ చేసి విజయం సాధించాడు. కానీ ఈ సారి సీన్ రివర్స్ అయింది. ఇటీవల జరిగిన ఈ పోరాటం లో ఓడిపోయాడు. బుల్ తన వాడి కొమ్ములతో అతడ్ని వీర లెవెల్లో కుమ్మేసింది. ఒక్క ఉదుటన ఎత్తి పారేసింది. దీంతో తీవ్ర గాయాల పాలైన బుల్ ఫైటర్ విక్టర్ ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. స్పెయిన్ లో గత 30 ఏళ్ళలో ఓ బుల్ ఫైటర్ ఇలా మరణించడం ఇదే మొదటిసారని అంటున్నారు.

బుల్ చేసిన ఘాతుకాన్ని ప్రేక్షకుల్లో ఉండి చూసిన అతని భార్య కన్నీరు మున్నీరయింది. విక్టర్ మృతి పట్ల ప్రధాని మరియానో రజోయ్ తీవ్ర సంతాపం ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:రష్యన్ హెలికాప్టర్ ఐసిస్ కూల్చేసింది (వీడియో)

ఇవి కూడా చదవండి:అగ్ర రాజ్యాన్ని కుదిపేస్తున్న వీడియో

English summary

World Famous Spanish Bull Fighter Victor Barrio dead in the ring in the attack of bull. He was rushed to the hospital but he died while taking treatment.