రోజా వ్యవహారంపై కమిటీ భేటీ 

Speaker Committee meeting on Roja Issue

06:07 PM ON 19th January, 2016 By Mirchi Vilas

Speaker Committee meeting on Roja Issue

అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో సిఎమ్ చంద్రబాబు , టిడిపి సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసి, ఏడాది పాటు వైసిపి ఎంఎల్ఎ రోజా సస్పెండ్ కి గురయిన నేపధ్యంలో సస్పెన్షన్, తదితర పరిణామాలపై డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ నేతృత్వంలో ఏర్పాటైన విచారణ కమిటీ మంగళవారంనాడు సమావేశమైంది. దాదాపు మూడు గంటల పాటు సాగిన సమావేశంలో శీతాకాలం శాసనసభా సమావేశాల్లో చోటు చేసుకున్న సంఘటనలపై కమిటీ చర్చించింది. శాసనసభ వీడియో ఫుటేజీల లీకేజీపై కూడా కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. తిరిగి ఈ నెల 27వ తేదీన సమావేశం కావాలని కమిటీ నిర్ణయించుకుంది. టిడిపి ఎంఎల్ఎ శ్రవణ్ కుమార్, వైసిపి ఎంఎల్ఎ శ్రీకాంత్ రెడ్డి, బిజెపి ఎంఎల్ఎ విష్ణు వర్ధన్ రెడ్డి లతో డిప్యూటి స్పీకర్ అధ్యక్షతన స్పీకర్ డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు కమిటీ ఏర్పాటుచేసిన సంగతి తెల్సిందే. వచ్చే సమావేశాల నాటికి ఈ కమిటీ నివేదిక అందజేయాలని స్పీకర్ ఆదేశించారు.

English summary

Andhra Pradesh Speaker Kodela Shiva Prasad Committee meeting on Roja Issue on Andhra Pradesh Assembly.What were the action to be taken on MLA Roja