కృష్ణ పుష్కరాలకు ప్రత్యేక హెలికాప్టర్లు

Special Helicopter Services To Krishna Pushkaralu

03:30 PM ON 6th May, 2016 By Mirchi Vilas

Special Helicopter Services To Krishna Pushkaralu

కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికులకు హెలీకాప్టర్‌ సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు దేవాదాయశాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఆగస్టు 12 నుంచి 23 వరకు కృష్ణా నదికి పుష్కరాలు జరగనున్నాయి. కర్నూలు జిల్లాలో శ్రీశైలం, సంగమేశ్వరంలో పుష్కరస్నానానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ తర్వాత పుష్కరస్నానాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండేది . శ్రీశైలంలోనే. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పుష్కరఘాట్లతో పోలిస్తే శ్రీశైలంలో గానీ, సమీపంలోగానీ రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు లేవు. కేవలం రోడ్డు మార్గంలోనే రావల్సి ఉంటుంది. శ్రీశైలంలో కృష్ణా నదితో పాటు శ్రీశైలం డ్యాం, నల్లమల అడవులు, టైగర్‌ ప్రాజెక్టు వంటి పర్యటక అనుకూలతలు అనేకం ఉన్నాయి. అందుచేత శ్రీశైలం పుణ్యక్షేత్రానికి పుష్కరస్నానం కోసం వచ్చే యాత్రికులకు హెలికాప్టర్ సదుపాయం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పవచ్చు. సున్నిపెంట వరకు హెలీకాప్టర్‌ సర్వీసుల్ని నడిపించే విషయమై దేవాదాయశాఖ అధికారులు ఇటీవల ఓ ప్రైవేటు సంస్థతో సంప్రదింపులు జరిపారు. హైదరాబాద్‌ నుంచి సున్నిపెంట వరకు పుష్కరాలు జరిగే 12 రోజులుపాటు హెలీకాప్టర్‌ సర్వీసుల్ని నడిపించాలని కోరినట్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:24 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇవి కూడా చదవండి:ఈ పార్క్ కి న్యూడ్‌గానే వెళ్ళాలట

ఇవి కూడా చదవండి:అల్లు అర్జున్ ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా?

English summary

Government Of Andhra Pradesh was planning to arrange special helicopters to devotes who will come to Krisha River Pushkaralu which were going to be held in August Month.