దసరా స్పెషల్: 'సువర్ణరథం' ఎక్కడానికి 30 వేలు చాలు!

Special offer for golden chariot train

04:53 PM ON 22nd September, 2016 By Mirchi Vilas

Special offer for golden chariot train

దసరా అనగానే మనందరికీ మైసూరుని తలచుకుంటాం. ఇక్కడ దసరా ఉత్సవాలు అంతగా ప్రఖ్యాతి గాంచాయి. ఇక ఈసారి దసరా ఉత్సవాలలో భాగంగా విదేశీ పర్యాటకులను, శ్రీమంతులను ఆకర్షించేందుకు మొదటిసారి సువర్ణరథాన్ని నడపనున్నారు. అక్టోబరు 1న బెంగళూరులోని తాజ్ వెస్టెండ్ పంచతార హోటల్ లో ప్రయాణీకులకు అల్పాహార విందు అనంతరం రైలు పర్యటన యశ్వంతపూర్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభం కానుంది. రాత్రికి రైలు మైసూరు చేరుకుంటుంది. తిరిగి పంచతార హోటల్ లోనే బస చేస్తారు. అక్టోబరు 2న శ్రీరంగపట్నంలోని పర్యాటక స్థలాలతో పాటు మైసూరులోని లలితమహల్ ప్యాలెస్, అంబావిలాస్ ప్యాలస్ లను తిలకించే అవకాశం కల్పిస్తారు.

అక్టోబరు 3న ఈ 'స్వర్ణరథం' బెంగళూరుకు తిరిగి రానుంది. తిరిగి అక్టోబరు 3, 5, 7, 9 తేదీలలో బెంగళూరు - మైసూరుల మధ్య సువర్ణరథం సంచరిస్తుందని కర్ణాటక పర్యాటకశాఖ మేనేజింగ్ డైరెక్టర్ కుమార్ పుష్కర్ ప్రకటించారు. దక్షిణభారతదేశపు ఏకైక లగ్జరీ రైలుగా ఖ్యాతి గడించిన సువర్ణరథంలో ప్రయాణించాలంటే టికెట్ రూపంలో ఒక్కొక్కరు అక్షరాలా రూ.30వేలు చెల్లించాల్సి ఉంటుంది. నిజానికి సువర్ణరథంలో ప్రయాణించేందుకు రూ.2లక్షల వరకు ప్రత్యేక ప్యాకేజీలు ఉన్నాయి. అయితే దసరా ఉత్సవాల కోసమే ప్రత్యేకంగా ఒక పగలు, రెండు రాత్రులతో ప్యాకేజీలు సిద్ధం చేశామని పుష్కర్ కుమార్ తెలిపారు.

ఇది కూడా చదవండి: 3 లక్షలు కోసం రోజంతా సెక్స్ చేస్తానని బెట్ కట్టాడు.. చివరికి ఏమైందో తెలుసా?

ఇది కూడా చదవండి: ఈ వస్తువులు మీ పర్స్ లో ఉంటే ఇక అంతా బంగారమే!

ఇది కూడా చదవండి: ఇంట్లో భార్యలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా?(వీడియో)

English summary

Special offer for golden chariot train