'బ్రహ్మోత్సవం' స్పెషల్ షోకి పర్మిషన్

Special permission for Brahmotsavam special show

09:34 AM ON 17th May, 2016 By Mirchi Vilas

Special permission for Brahmotsavam special show

అవును సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు శుభవార్త ఇది. బ్రహ్మోత్సవం ప్రమోషన్ కోసం ఇదో వెరైటీ షో. ఈ నెల 20న ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఆ రోజు ఉదయం 8.10 గంటలకు హైదరాబాద్ తో బాటు తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్లలో ఈ సినిమా స్పెషల్ షో ప్రదర్శిస్తారట. మహేష్ ఫ్యాన్స్, ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఈ షో ఉంటుందని నిర్మాత పివిపి, నైజాం డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ తెలిపారు. తన సినిమా కోసం మహేష్ ఇప్పటికే మీడియాకు, వివిధ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. బ్రహ్మోత్సవం రిలీజ్ కు ముందే ఆడియెన్స్ లో ఈ చిత్రం పట్ల క్రేజ్ పెంచాలన్న తన ప్లాన్ ను చక్కగా అమలు చేశాడు.

కాగా తన మూవీ రిలీజ్ నాటికి మహేష్ హైదరాబాద్ లో ఉండడని, 15 రోజుల విరామం కోసం ఈ నెల 18 నే విదేశీ ట్రిప్ పెట్టుకున్నాడని తెలిసింది. తన ఫ్యామిలీతో తిరిగి జూన్ ఫస్ట్ వీక్ లో హైదరాబాద్ చేరుకుంటాడని సమాచారం.

English summary

Special permission for Brahmotsavam special show