నీతి ఆయోగ్ పరిశీలనలో ప్రత్యేక హోదా 

Special Status Is In The Hands Of Niti Aayog

12:21 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Special Status Is In The Hands Of Niti Aayog

'దేశంలో చాలా రాష్ట్రాలు ప్రత్య్హేక హోదా కోరుకుంటున్నాయి. పంజాబ్ లాంటి రాష్ట్రాలు ప్రత్యేక హోదా అడుగుతున్నాయి. దేశ సమగ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు బాధ్యాతాయుటంగా వ్యవహరించాలి. కానీ ఎపికి రెవెన్యు లోటు ఉన్నందున ప్రత్యేక హోదా అడుగుతున్నాం. ప్రత్యేక హోదా ఎపికి రావాలని ఆకాంక్షిస్తున్నాం. నీతి అయోగ్ పరిశీలనలో ప్రత్యేక హోదా అంశం వుంది.' అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. పార్లమెంట్ ఉభయసభలు రెండో రోజూ ప్రారంభమయ్యాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గౌరవార్థం రెండో రోజూ కూడా ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్నాయి.

శుక్రవారం ఉదయం ఆరంభమైన సభలో దేశంలో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని స్పంచడంలేదంటూ కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాధిత్యసింధియా సంధించిన ప్రశ్నకు కేంద్రమంత్రి వెంకయ్య స్పందిస్తూ , ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం పార్టీలకు సరికాదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని అంశాలకు సమాధానం ఇస్తుందన్నారు. దేశమంతా మనల్ని గమనిస్తుందనే విషయం గుర్తించాలన్నారు. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని వెంకయ్య పేర్కొన్నారు.. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా అంశాన్ని వెంకయ్య ప్రస్తావించారు. మరో పక్క రాజ్య సభలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడారు.

English summary

Central Minister Venkayya Naidu Says That various states are asking special status for their states. Venkayya Naidu Says that special status matter are in the observation of NIti Aayog Comitee