వేసవికి ప్రత్యేక రైళ్లు వచ్చేస్తున్నాయ్

Special trains arranged on summer trips

11:23 AM ON 1st February, 2017 By Mirchi Vilas

Special trains arranged on summer trips

సాధారణంగా వేసవి కాలం వస్తుంటే, పిల్లలకు పరీక్షలు ఆతర్వాత సెలవలు మొదలవుతాయి. సెలవుల్లో సొంత ఊళ్లకు వచ్చేవాళ్ళు, టూర్ లు వెళ్ళేవాళ్ళు వుంటారు కదా. అందుకే వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ఇక ఈసారి కూడా వేసవికి రైళ్లను సిద్ధం చేసింది. విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య 8 ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 7 నుంచి 28వ తేదీ వరకు ప్రతి మంగళవారం ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి విశాఖకు ఫిబ్రవరి 8 నుంచి మార్చి 1వరకు ప్రతి బుధవారం ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. 22 కోచ్ లతో నడిచే ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్ల మీదుగా నడపనున్నారు.

అంతేకాకుండా విశాఖ పట్నం- తిరుపతి మధ్య మరో 8 ప్రత్యేక వీక్లీ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. ఫిబ్రవరి 6 నుంచి 27వ తేదీ వరకు ప్రతి సోమవారం ఈ రైళ్లు నడుస్తాయి. తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి విశాఖపట్నానికి ఫిబ్రవరి 7 నుంచి 28వ తేదీ వరకు ప్రతి మంగళవారం ప్రత్యేక రైలు నడుస్తుంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, న్యూగుంటూరు, తెనాలి, నెల్లూరు, గూడురు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్ల మీదుగా నడుస్తాయి.

కాగా విశాఖఫట్నం నుంచి విల్లుపురానికి మరో 78 ప్రత్యేక సువిధ, ఎక్స్ ప్రెస్ రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు. ఇవి వారంలో మూడు రోజులు నడవనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి జూన్ 28 వరకు ప్రతి సోమ, బుధ,శనివారం లలో ఈ రైళ్లు నడుస్తాయి. తిరుగు ప్రయాణంలో విల్లుపురం నుంచి విశాఖపట్నానికి ఏప్రిల్ 2 నుంచి జూన్ 29 వరకు వారంలో మూడు రోజులు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు మంగళ, గురు, ఆదివారాల్లో నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. 18 కోచ్ లతో నడిచే ఈ రైళ్లు దువ్వాడ, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, తెనాలి, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, సూళ్లూరు పేట, చెంగల్పట్టు స్టేషన్ మీదుగా నడుస్తాయి.

ఇది కూడా చూడండి: బాప్ రే , అక్కడ చెట్లకు డబ్బులు కాస్తాయట.?

ఇది కూడా చూడండి: వావ్ .. అంతరిక్షంలో దిబ్బరొట్టె..

English summary

government is planning to arrange special trains between visakhapatnam and secunderabad on summer trips.