మే, జూన్లో స్పెక్ట్రమ్‌ ఆక్షన్

Spectrum Auction On May and June Months

10:43 AM ON 23rd January, 2016 By Mirchi Vilas

Spectrum Auction On May and June Months

వచ్చే మే, జూన్‌ నెలల్లో స్పెక్ట్రమ్‌ తదుపరి దశ వేలాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయాన్ని ఎఫ్‌ఐసీసీఐ డబ్యూబీఏ విజన్‌ ఫోరంలో టెలికాం మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాకేశ్‌ గార్గ్‌ వెల్లడించారు. టెలికాం సంస్థల వ్యాపార అవసరాలకు అనుగుణంగా స్పెక్ట్రమ్‌ని అందుబాటులోకి తేవాలని తాము భావిస్తున్నామని చెప్పారు. మే లేదా జూన్‌లో ఈ వేలం నిర్వహిస్తామని చెప్పారు. వేలానికి సంబంధించి ప్రారంభ ధరను నిర్ధారించేందుకు ఇప్పటికే ప్రభుత్వం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌)తో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా ఎంత ధర నిర్ణయించవచ్చన్న దానిపై ఆలోచిస్తున్నామన్నారు.

English summary

Telecom ministry Secretary Rakesh Garg said that Spectrum Auction On May and June Months on this year.He says that the Starting Price of this spectrum was to be Fixed by TRAI