'స్పీడున్నోడు' ఆడియో రిలీజ్‌ డేట్‌!

Speedunnodu movie audio release date

02:32 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Speedunnodu movie audio release date

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ 'అల్లుడుశీను' చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేసి మొదటి చిత్రంతోనే కమర్షియల్‌ హీరోగా గుర్తింపు పొందాడు. బెల్లంకొండ శ్రీనివాస్‌ తాజాగా నటిస్తున్న రెండవ చిత్రం 'స్పీడున్నోడు'. 'అన్నవరం' ఫేమ్‌ భీమనేని శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం చివరి దశలో ఉంది. 'జాదుగాడు' ఫేమ్‌ సోనారిక బడోరియా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఆడియో ని హైదరబాద్ లో జనవరి 16న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన 'సుందర్‌ పాండ్యన్' కి ఇది రీమేక్‌. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ లవ్‌ స్టోరీని ఫిబ్రవరి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

English summary

Speedunnodu movie audio releasing on January 16th. Bellamkonda Srinivas and Sonarika Bhadoria is pairing in this movie.