స్పైస్‌ నుంచి నెక్సియాన్‌ మొబైల్

Spice Launched Nexian NV-45 In India

03:12 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Spice Launched Nexian NV-45 In India

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ స్పైస్‌ కొత్త మొబైల్ లోను విడుదల చేసింది. నెక్సియాన్‌ పేరుతో అంతర్జాతీయ బ్రాండ్‌ నెక్సియాన్‌ను భారత్‌లోకి తీసుకువచ్చింది. ఈ-కామర్స్‌ సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ సహాయంతో స్పైస్‌ నెక్సియాన్‌ ఎన్‌వీ-45 మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ ధర రూ.3,799గా ప్రకటించింది. 4.5 అంగుళాల తెర డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ డిస్ ప్లే ఉన్న ఈ ఫోన్ 1 జీబీ ర్యామ్ తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్, 1.2 గిగాహెడ్జ్‌ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌, 5 ఎంపీ వెనుక కెమెరా, 3.2 ఎంపీ ముందు కెమెరా, డ్యుయల్‌ సిమ్‌, 3జీ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. 8 జీబీ ఇంటర్నల్‌ మెమొరీని 32 జీబీ వరకు పెంచుకునే వీలుంది. 1650 ఎంఏహెచ్‌ బ్యాటరీ కెపాసిటీ ఈ ఫోన్ సొంతం. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ద్వారా మార్కెట్ లో తన వాటా పెంచుకోవాలని స్పైస్ భావిస్తోంది.

English summary

Spice mobile company launched International Smartphone company Nexian in India. Spice had launched Nexian Nv-45 smart phone in India. This phone was available in Online shopping Site Flipkart