శ్రీ దుర్ముఖిలో మీ రాశి ఫలాలు తెలుసుకోండి 

sri durmukhi nama samvatsara rasi phalalu

12:33 PM ON 6th April, 2016 By Mirchi Vilas

sri durmukhi nama samvatsara rasi phalalu

కొత్త తెలుగు సంవత్సరం వస్తోందంటే, అందరికీ తమ జాతకం ఎలా వుంటుందోననే ఆతృత, తమ జీవితంలో మార్పు వస్తుందనే ఆశ ఇంచుమించు అందరిలో వుంటాయి. అందుకే ఉగాది నాడు పంచాంగ శ్రవణం ద్వారా రాశి ఫలాలు , దేశ - రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటాయో వివరించడం తెల్సిందే. ఏప్రియల్ 8వ తేదీన శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఆరంభం సందర్భంగా మిర్చి విలాస్ వీక్షకుల కోసం 12 రాశుల వారి నూతన సంవత్సర ఫలితాలు అందిస్తున్నాం..

ఇది కూడా చదవండి :నమ్మలేని క్రేజీ పండుగలు

ఇది కూడా చదవండి :ఇండియాలో భారతీయులకు ఎంట్రీ లేని ప్రదేశాలు

ఇది కూడా చదవండి :దేవుని గదిలో ఎన్ని విగ్రహాలను ఉంచి పూజ చేయాలి

1/13 Pages

1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం)

ఆదాయం: 2 వ్యయం: 8

రాజపూజ్యం: 1 అవమానం: 7

మేష రాశి వారికి శ్రీ దుర్మిఖిలో ఆర్థిక విషయాలు, వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరం గా వుంటుంది. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిళ్లు అధికం. శ్రమకు తగిన ఫలితం అందకపోవడంతో నిరుత్సాహపడతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపాలి. డ్రైవింగ్ లో నిదానం అవసరం. స్థిరాస్తులు పెంపొందించుకుంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. అయితే ఏప్రిల్, మే మాసాల్లో ప్రేమ వ్యవహారాలు బెడిసికొట్టే ప్రమాదం లేకపోలేదు. శని వక్రగమనంలో ఉన్న 2016 ఏప్రిల్ - ఆగస్టు మాసాల మధ్య దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. పాతబకాయిలు వసూలవుతాయి. కానుకలు, బహుమతులు అందుకుంటారు. గురువు వక్రగమనంలో ఉన్న ఉగాది నుంచి రెండు మాసాల పాటు గురువు వక్రించినందున పెట్టుబడుల్లో నిదానం పాటించాలి. విద్యార్థులు లక్ష్య సాధనకు పట్టుదలతో కృషి చేయాలి. విదేశీ గమనానికి ఆటంకాలు ఎదురవుతాయి. పొదుపు పథకాల్లో నష్టం సంభవం. 5-11 స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా ప్రేమవ్యవహారాలు, స్నేహాలు దెబ్బతింటాయి. పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. విద్యార్థులు అశ్రద్ధ కార ణంగా నష్టపోతారు. ఆర్థిక ఇబ్బందుల అధికంగా ఉంటాయి. కొత్త వ్యాపారాల ప్రారంభానికి ఇది తగిన సమయం కాదు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. విలాసాలకు వెచ్చిస్తారు. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగ ప్రాప్తికి, ప్రమోషన్లకు, వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. విద్య, వైజ్ఞానిక రంగాలలో విశేష ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్హతలు, నైపుణ్యానికి తగిన సదవకాశాలు లభిస్తాయి. పిల్లల విద్య, వృత్తి, వివాహం విషయాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఆగస్టు 12 నుంచి గురువు కన్యారాశిలో సంచరిస్తాడు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో వికాసం కనిపిస్తుంది. అయితే అదనపు బాధ్యతలు మోయాల్సి వస్తుంది. అనారోగ్యం, పనుల్లో ఆలస్యం, ఆర్థిక ఇబ్బందులు, అనవసర వ్యయం ఉంటాయి. అపనిందలు మోయాల్సి వస్తుంది.

దుర్ముఖి నామ సంవత్సరంలో 2016 జనవరి 24 వరకు వృశ్చికంలో, ఆ తరువాత ధనుస్సులో శనిసంచారం జరగడంవలన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అయితే ఆర్థిక విషయాల్లో చిక్కులు ఎదుర్కొంటారు. రుణబాధలు అధికం. ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ చూపాల్సిన అసవరం ఉంది. ఎముకలు, కీళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మానసిక అశాంతి బాధిస్తుంది. నిధుల విషయంలో మాటపడాల్సి రావచ్చు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా, మ్యూచ్యువల్ ఫండ్స్లో పనిచేసే వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉమ్మడి నిధుల నిర్వహణలో అపనిందలు ఎదుర్కొంటారు. బంధుమిత్రుల వ్యవహారాల్లో మాటపడాల్సి వస్తుంది. శివారాధన వల్ల ఈ ఏడాది సత్ఫలితాలు పొందవచ్చు.

English summary

sri durmukhi nama samvatsara rasi phalalu in telugu language. you want to know your future then read carefully.