కివీస్ కు షాకిచ్చిన లంక

Sri Lanka beat New Zealand in third ODI

12:27 PM ON 1st January, 2016 By Mirchi Vilas

Sri Lanka beat New Zealand in third ODI

న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో శ్రీలంక ఆశలు నిలుపుకుంది. మూడో వన్డేలో శ్రీలంక 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 277 పరుగుల టార్గెట్ ను 22 బంతులు మిగులుండగానే ఛేదించింది. 46.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. గుణతిలక(65), దిల్షాన్(91), తిరిమన్నె(87) రాణించడంతో లంక విజయం సాధించింది. చండిమాల్ 27 పరుగులు చేశాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 276 పరుగులు చేసింది. విలియమ్సన్ 59, లాథమ్ 42, సాంత్నర్ 38, గప్టిల్ 30, బ్రాస్ వేల్ 30, నికోల్స్ 20, సౌతీ 18, మిల్నె 17 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో ప్రదీప్, చమీర, వాండర్ సే రెండేసి వికెట్లు పడగొట్టారు. సిరివర్దన ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇప్పటికీ కివీస్ సిరీస్ లో 2-1 ఆధిక్యంలో ఉంది.

English summary

Sri Lanka beat New Zealand in third ODI