నోబెల్ నామినీల్లో రవిశంకర్?

Sri Sri Ravi Shankar nominated for Nobel Peace Prize

12:37 PM ON 4th February, 2016 By Mirchi Vilas

Sri Sri Ravi Shankar nominated for Nobel Peace Prize

ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవిశంకర్ నామినేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ అవార్డుకు భారత్ నుంచి ఆయన అర్హుడని, ఈ ఏడాది నామినీల్లో ఆయన పేరు ఉండనుందని థామ్సన్ రాయిటర్స్ సంస్థ పేర్కొంది. కొలంబియాలో శాంతి స్థాపనకు రవిశంకర్ ఎంతగానో కృషి చేశారని కొనియాడింది. అయితే, దీనిపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి తెలిపారు. కొలంబియాలో శాంతిని నెలకొల్పేందుకు 2012 నుంచి ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. రవిశంకర్ శాంతి సేవలకుగాను దేశ అత్యున్నత పౌరపురస్కారంతో ఆ ప్రభుత్వం సత్కరించింది. 2015లో క్యూబాలో పర్యటించినపుడు చర్చల ద్వారా కొలంబియా తిరుగుబాటు దళాల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు ఆయన కృషి చేశారు. మొత్తం 150 దేశాల్లో ఆయన సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆయన సేవలను గుర్తించి భారతప్రభుత్వం ఇటీవల దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ ను అందించిన సంగతి తెలిసిందే.

English summary

The Art of Living founder Sri Sri Ravi Shankar has appeared as a likely contender for the prestigious award. The nominations for this year's Nobel Peace Prize.Recently He was awarded with Padma Vibhushan by Indian Government