దీపావళికి అదరగొట్టిన తల్లీ కూతుళ్ళ సోకులు...

Sridevi and Kushi Kapoor in Diwali celebrations

05:07 PM ON 31st October, 2016 By Mirchi Vilas

Sridevi and Kushi Kapoor in Diwali celebrations

ఒకప్పుడు అదిరేటి డ్రెస్ మీరేస్తే అనే పాట ఓ ఊపు ఊపేసింది. మళ్ళీ ఆపాటను గుర్తు తెచ్చేలా ఈసీను వుంది. ఒకప్పుడు తెలుగు - తమిళ సినీరంగాలను ఏలిన మహారాజ్హి ఆమె. ఇక ఈమె తన పదహారేళ్ల వయసులోనే తన అందచందాలతో ప్రేక్షకుల మనసులను మెలిపెట్టేసిన అతిలోక సుందరి. ఇప్పుడు 50 ఏళ్లు దాటినా ఇంకా సరిరారు నాకెవ్వరూ అంటున్న ఈ సుందరి ఎవరో ఈపాటికే తెలిసిపోతుంది. ఇంకెవరు అలనాటి హీరోయిన్ శ్రీదేవి. ఇప్పుడు తన కుమార్తెను బాలీవుడ్ కు పరిచయం చేయాలని భావిస్తున్న ఆమె కూతురితోనూ అందంలో పోటీ పడుతోంది. అంతేకాదు.. దీపావళి బాణసంచా తళుకులు కూడా ఆ తల్లీకూతుళ్ల సోకుల ముందు వెలవెలపోయేలా ఉన్నాయి.

దీపావళి సందర్భంగా సోషల్ మీడియాలో బాలీవుడ్ ప్రముఖుల చిత్రాలు షికార్లు చేస్తున్నాయి. వారు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు చేస్తున్నవి కొన్నయితే.. అభిమానులు షేర్ చేస్తున్నవి ఇంకొన్ని. తాజాగా శ్రీదేవి కూడా తన కుమార్తె ఖుషి కపూర్ తో కలిసి అదిరిపోయే డ్రెస్ లో కనువిందు చేస్తూ శుభాకాంక్షలు చెప్పేశారు. ఆ ఇద్దరి అందం... అతిశయం... చూస్తున్న వారు తల్లీకూతుళ్లిద్దరూ మిరుమిట్లు గొలుపుతున్నారంటున్నారు. సంప్రదాయ లంగా... ఛోలీ... బంగారు వర్ణ తీగలు మేళవించి రూపొందించిన ఇద్దరు దుస్తులు ఆ గ్రాండ్ లేడీస్ ను మరింత గ్రాండ్ గా చూపిస్తున్నాయి. ఇంతకీ ఆ సుందరాంగుల అందానికి మరింత వన్నె తెచ్చేలా డిజైన్ చేసిందెవరంటే, ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా. అదిరింది అంటూ కామెంట్లు పడిపోతున్నాయి.

English summary

Sridevi and Kushi Kapoor in Diwali celebrations