ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో శ్రీదేవి కూతురు

Sridevi Daughter Jhanvi Joins In Film School

10:22 AM ON 23rd February, 2016 By Mirchi Vilas

Sridevi Daughter Jhanvi Joins In Film School

ఒకప్పుడు దశాబ్దం పైగా కుర్ర కారుని విశేషంగా ఆకర్షిస్తూ , హొయలు ఒలకబోసిన ప్రముఖ బాలీవుడ్ నటి శ్రీదేవి వారసత్వాన్ని పుణికి పుచ్చుకునేందుకు ఆమె కుమార్తె జాన్వి బాలీవుడ్‌లో అరంగేట్రానికి రంగం సిద్ధమవుతోందా అంటే ... అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆమెను నటిగా తీర్చిదిద్దే పనిలో శ్రీదేవి తలమునకలుగా ఉందన్న మాటలకు అనుగుణంగా శ్రీదేవి, బోనికపూర్ పెద్ద కుమార్తె అయిన జాన్వి తాజాగా లాస్‌ఏంజెలెస్‌లోని ప్రఖ్యాత లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరింది. జాన్వికి సినిమాల్లో నటించే ఉద్దేశం లేదని, ఫ్యాషన్ డిజైనింగ్‌లో తన కెరీర్‌ను కొనసాగిస్తుందని శ్రీదేవి గతంలో చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం జాన్వి యాక్టింగ్ స్కూల్లో చేరడంతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖాయమైంది. రెండో కపూర్ కుటుంబం నుంచి వస్తున్న ఐదో కపూర్ జాన్వినే. అనిల్ కపూర్, సంజయ్ కపూర్, సోనమ్ కపూర్, సోదరుడు అర్జున్ కపూర్ తర్వాత జాన్వివి ఇప్పుడు బాలీవుడ్‌లో తెరంగేట్రం చేయబోతోంది. ఇక బాలీవుడ్‌లో జరిగే దాదాపు అన్నికార్యక్రమాలకు శ్రీదేవి తన ఇద్దరు కుమార్తెలు జాన్వి, కుషితో కలిసి హాజరవుతున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా ఇప్పటికే జాన్వికి ఇప్పటికే బాలీవుడ్ ఆఫర్లు కుప్పులు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. అయితే ఓ మంచి సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలని జాన్వి భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ కూడా లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ పూర్వ విద్యార్థే. అంటే జాన్వి కూడా ఈ స్కూల్ నుంచే వస్తోందన్న మాట.

English summary

Boni Kapoor and Sri Devi's first daughter Jhanvi Kapoor to Attend Los Angeles Acting School.After Ranbir Kapoor, Rahul Khanna and Riteish Deshmukh, Sridevi’s and Boney Kapoor’s elder daughter Jhanvi Kapoor has also joined the Lee Strasberg Theatre & Film Institute in Los Angeles.