శ్రీజకు దిమ్మతిరిగేలా రెండో పెళ్లి చేసుకుంటున్న మాజీ భర్త!

Srija ex husband Bharadwaj second marriage with famous businessman daughter

11:46 AM ON 15th October, 2016 By Mirchi Vilas

Srija ex husband Bharadwaj second marriage with famous businessman daughter

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొన్నేళ్ల కిందట ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇంట్లో వాళ్లను ఎదిరించి, శిరీష్ భరద్వాజ్ ను ఆమె పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు వారి దాంపత్య జీవితం బాగానే ఉన్నా, ఆతర్వాత ఏమైందో ఏమో కానీ వారి జీవితంలో కలతలు మొదలయి విడాకులకు దారి తీసింది. ఆ తర్వాత శ్రీజకు రెండో పెళ్లి జరగడం తెలిసిందే. ఇక, ఇప్పుడు ఆమె మాజీ భర్త భరద్వాజ్ కూడా రెండో పెళ్లి బాటలో వెళుతున్నట్లు తెలిసింది. వాస్తవానికి అప్పట్లోనే ఇలాంటి వార్తలు వచ్చినా, అది నిజం కాలేదు. అయితే శ్రీజ దిమ్మ తిరిగేలా తాను పెళ్లి చేసుకోవాలని భరద్వాజ నిశ్చయించుకున్నాడట.

అందులో భాగంగానే ఓ పెద్ద వ్యాపారవేత్త కుమార్తెను పెళ్లి చేసుకోబోతున్నాడని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం చిరుకు పోటీగా బీజేపీలో చేరి రాజకీయంగా ఎదుగుదలకు మెట్లు వేసుకుంటున్న భరద్వాజ్.. త్వరలోనే శ్రీజకు, వారి కుటుంబానికి షాక్ ఇచ్చేలా అంగరంగ వైభోగంగా పెళ్లి చేసుకోబోతున్నాడని అతడి సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మరి శ్రీజకు అంతలా షాకిచ్చేలా పెళ్లి ఎలా చేసుకోబోతున్నాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే. రాజకీయంగా కూడా ఈ వార్త సంచలనం అవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

English summary

Srija ex husband Bharadwaj second marriage with famous businessman daughter