జైపూర్ కోటలో శ్రీజ పెళ్లి

Srija Marriage In Jaipur Palace

10:49 AM ON 29th February, 2016 By Mirchi Vilas

Srija Marriage In Jaipur Palace

మెగాస్టార్ చిరంజీవి ఇంట చిన్న కూతురు పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుండటంతో  సందడి తారా స్థాయికి చేరింది. చిన్నకూతురు పెళ్లిని ఘనంగా జరపాలని ఫిక్సయ్యాడు చిరంజీవి. గతంలోనే ఈమెకు శిరీష్ భరద్వాజ్ తో పెళ్లి జరిగినా.. తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసింది. తండ్రిగా అప్పుడు కోల్పోయిన సంతోషాన్ని ఇప్పుడు  చిరంజీవి సంపూర్ణంగా పొందుతున్నాడట. 

    అయితే పెళ్లి ఎక్కడ , ఎప్పుడు అనే విషయాలపై క్లారిటీ లేదని భావిస్తున్న తరుణంలో శ్రీజ పెళ్లి పై తాజాగా మరో వార్త బయటికి వచ్చింది. చిరు చిన్నకూతురు పెళ్లిని హైదరాబాద్ లోనే జరిపిస్తారని అనుకున్నా మెగా మ్యారేజ్ తెలంగాణ నుంచి  జైపూర్ షిఫ్ట్ అయిందట. మార్చ్ 28న శ్రీజ పెళ్లి జైపూర్ కోటలో జరగబోతోందట. చాలా దగ్గర వాళ్ళను మాత్రమే పెళ్ళికి పిలుస్తున్నట్లు ఇప్పటికే తేలిపోగా, ముందు శ్రీజ పెళ్లి హైదరాబాద్ లో జరిపించాలని అనుకున్నా, ఆ తర్వాత తిరుపతిలో చేయాలనుకున్నారు. కానీ మెగాస్టార్ అండ్ ఫ్యామిలీ కలిసి తీసుకున్న నిర్ణయం ప్రకారం పెళ్లి వేదిక జైపూర్ కి మారిందట. 

   ఇక కత్తి రీమేక్ ను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మొదలు పెట్టాలని భావించిన చిరంజీవికి కూతురు పెళ్లి రూపంలో  అడ్డంకి ఏర్పడడంతో చిరంజీవి. మొత్తానికి మార్చ్ 28 వరకు చిరంజీవి కొత్త సినిమా గురించి అప్ డేట్స్ లేనట్లేనని తేలిపోయింది. కూతురు పెళ్లి తర్వాత మెగా స్టార్ 150వ సినిమా కోసం కెమెరా ముందుకు వస్తాడని భావించవచ్చు.

మరిన్ని విషయాలు స్లైడ్ షోలో.....

1/5 Pages

శ్రీజ ఎవరిని పెళ్లి చేసుకోబోతోంది.?

చిత్తూరుకి చెందిన ఒక పెద్ద వ్యాపారవేత్త కిషన్‌ తనయుడైన కళ్యాణ్‌ అనే కుర్రాడిని శ్రీజ వివాహం చేసుకోబోతుంది. 

 

English summary

Chiranjeevi daughter marriage fixed at Jaipur palace. Chiranjeevi's younger daughter Srija's wedding. Finally there is some news about it. Chiranjeevi is preferring a destination wedding for his daughter.