శ్రీజ పెళ్ళి అతనితోనా!

Srija marriage with her classmate

11:12 AM ON 15th February, 2016 By Mirchi Vilas

Srija marriage with her classmate

మెగాస్టార్‌ చిరంజీవి రెండవ కూతురు శ్రీజ మరోసారి వివాహం చేసుకోబోతుందన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చిరు ఇంట్లో పెళ్ళిసందడి అని చెప్పిన వచ్చిన ఫోటోలు ఇంటర్నెట్‌లో బాగా హల్‌చల్‌ చేశాయి. అయితే ఈ విషయాలేవీ చిరు అధికారికంగా ప్రకటించలేదు. అంతేకాదు శ్రీజకి కాబోయే భర్త ఎవరా అనే విషయం కూడా ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు ఆ విషయాలు బయటకొచ్చాయి. చిత్తూరుకి చెందిన ఒక పెద్ద వ్యాపారవేత్త కిషన్‌ తనయుడైన కళ్యాణ్‌ అనే కుర్రాడిని శ్రీజ వివాహం చేసుకోబోతుంది. అంతేకాదు కళ్యాణ్‌-శ్రీజ కాలేజీ రోజుల్లో క్సాస్‌మేట్స్‌ అట. వీరిద్దరూ ఇది వరకే మంచి స్నేహితులని సమాచారం.

ఫిబ్రవరి 1న వీరిద్దరూ నిశ్చితార్ధం ఒక ప్రముఖ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఫిబ్రవరి 10న శ్రీజను పెళ్ళి కూతురు చేశారని సమాచారం. శ్రీజ పెళ్ళి మార్చిలో జరగబోతుందట. ఆ వివాహ తేదీని చిరు అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.

English summary

Mega Star Chiranjeevi small daughter Srija marrying her classmate Kalyan. He is the big industrialist in US.