అమ్మాయిల ఎదుట ఎక్స్ పోజింగ్ చేసిన నటుడు అరెస్ట్

Srijith arrested for exposing infront of girls

03:30 PM ON 3rd September, 2016 By Mirchi Vilas

Srijith arrested for exposing infront of girls

సినిమా వాళ్ళం ఏం చేసినా పర్వాలేదనుకుంటే కుదరదని ఈ ఘటన మరోసారి నిరూపించింది. కారులో కూర్చున్న మళయాళ సినీ నటుడు శ్రీజిత్ రవి దాదాపు 15 మంది విద్యార్థినుల ఎదుట ఎక్స్ పోజింగ్ చేసి, వారి ఫొటోలు తీసుకున్నాడని ఫిర్యాదు రావడంతో శ్రీజిత్ రవిని గురువారం ఒట్టపాళెం పోలీసులు అరెస్టు చేశారు. ఓ ప్రైవేటు స్కూలు ప్రిన్సిపాల్ చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో కారు నెంబరును మాత్రమే రాశారు, కానీ రవి పేరు పేర్కొనకపోవడం విశేషం. అయితే విద్యార్థినులు తాము రవిని గుర్తుపట్టినట్లు చెప్తున్నారు. షోర్నూర్ డిప్యూటీ ఎస్.పీ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఫిర్యాదులో పేర్కొన్న నెంబరుగల కారు శ్రీజిత్ రవిదే కనుక ఆయనను అరెస్టు చేశామన్నారు.

త్వరలోనే ఆయనను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తామన్నారు. బాలలను లైంగిక నేరాల నుంచి కాపాడే చట్టంలోని నిబంధనల ప్రకారం రవిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అయితే కారు తనదేనని, అయితే తాను అసభ్యకరంగా ప్రవర్తించలేదని శ్రీజిత్ రవి అంటున్నాడు.

ఇది కూడా చదవండి: ఒంటిమీద చీరను విప్పి ముగ్గురు ప్రాణాలను కాపాడింది!

ఇది కూడా చదవండి: మంత్రగాళ్లన్న అనుమానాంతో పళ్లూడ గొట్టారు...

ఇది కూడా చదవండి: వినాయక చవితికి 21 పత్రాలతో పూజ.. నిమజ్జనం వెనుక అసలు కధ తెలుసా?

English summary

Srijith arrested for exposing infront of girls