మెగాస్టార్ కోసం స్టేషన్ మెట్లు ఎక్కా ...    

Srikanth About Chiranjeevi

01:02 PM ON 12th February, 2016 By Mirchi Vilas

Srikanth About Chiranjeevi

తెలుగు ఇండస్ట్రీలో మెగా స్టార్ చిరంజీవి కి ఫాలోయింగే వేరు చిరు చిందేసినా, ఫైట్ చేసినా ఏమి ఇరగదీసాడు అంటూ ఉబ్బి తబ్బిబ్భయ్యే ఫాన్స్ ఎంతమంది వున్నారో చెప్పలేం. ఇక ఇండస్ట్రీలో కూడా చాలామంది నటీనటుల్లో కూడా మెగా స్టార్ వీరాభిమానులున్నారు. అందులో అగ్రగణ్యుడు హీరో శ్రీకాంత్ ముందు వరుసలోనే ఉంటాడు. చిరంజీవి అంటే వల్లమాలిన ప్రేమ, అబిమానం గల శ్రీకాంత్, చిరుతో కల్సి శంకర్ దాదా ఎంబిబిఎస్ వంటి చిత్రాల్లో చేసిన ఏక్టింగ్ కూడా ఇందుకు అద్దం పడుతుంది. చిరు కోసం పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్లానని ఆ మధ్య ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో శ్రీకాంత్ చెప్పడంతో అభిమానులే కాదు వీక్షకులు కూడా షాక్ అయ్యారు. ”చిరంజీవి గారిని ఎవరైనా ఏమైనా అంటే వెళ్లి కొట్టేవాణ్ని. ఆయన కోసం పోలీసు స్టేషన్‌కు కూడా వెళ్లాను. ఇప్పుడాయన రాజకీయాల్లోకి వచ్చేశారు. నాయకుడిగా ఆయనను నేను ఫాలో అవ్వలేదు గానీ హీరోగా మాత్రం ఆయననే అనుసరిస్తా. ఇప్పటికీ చిరు అంటే చాలా ఇష్టమే” అంటూ శ్రీకాంత్ చెప్పడం చూస్తుంటే , చిరు పట్ల శ్రీకాంత్ కున్న అభిమానం కాదు వీరాభిమానం ఎలాంటిదో వేరే చెప్పనవసరం లేదు.

ఇక దూకుడు స్వభావం కూడా మెండుగానే వున్న శ్రీకాంత్ ఇంకా ఏమన్నాడంటే, ”నా తప్పు ఉందంటే క్షమాపణ చెప్పేస్తా. లేదనుకుంటే మాటలు రావు.. వెళ్లి కొట్టేసి వచ్చేయడమే. ఏదో ఒక ఊళ్లో కెమెరామన్‌ షర్టు పట్టుకునేసరికి వెళ్లి కొట్టేశాను కూడా. అలాంటివి మూడు నాలుగు సంఘటనలు జరిగాయి. ఓ దర్శకుడితో చోటుచేసుకున్న గొడవ చివరకు ముదిరిపోవడంతో షూటింగ్‌ చేయనని వెళ్లిపోయా. ఓసారి ఓ కమెడియన్‌ని కూడా కొట్టేశాను. ఇక ఇంట్లోవాళ్లు భయపడుతుండటంతో ఈ మధ్య బాగా నియంత్రించుకుంటున్నాను” అంటూ వివరించాడు. వంద చిత్రాలు పూర్తిచేసుకుని , ఇంకా నటిస్తూ , మరోపక్క తనయుడుని కూడా రంగప్రవేశం చేయిస్తున్న శ్రీకాంత్ దూకుడు బానే తగ్గిందని అంటున్నారు చాలామంది ఇప్పుడు.

English summary

Hero Srikanth says that he was big fan of Megastar Chiranjeevi and he says that at some time he used to go to police station for Chiranjeevi.He says that he gets angry when anybody made comments on Chiranjeevi.This was said by Srikanth in a TV interview