కష్టాల్లో శ్రీకాంత్ అడ్డాల...

Srikanth Addala is waiting for offers

10:42 AM ON 20th June, 2016 By Mirchi Vilas

Srikanth Addala is waiting for offers

ఒక సినిమా హిట్టయ్యిందంటే.. వెనుకనే పెద్ద హీరోలందరూ పడతారు. అదే ఒక సినిమా ఫ్లాపైందంటే మాత్రం.. అందరూ ముఖం చాటేస్తారు. ఎవరు ఎన్ని అన్నా సర్దుకుపోతేనే సినీ ఇండస్ట్రీలో మనుగడ ఉంటుంది. పాత తరంలో చిరంజీవి వంటి హీరోలు వరసగా రాఘవేంద్రరావు తీసిన మూడు సినిమాలు ఫ్లాపైనా పిలిచి మరీ జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి ప్రాజెక్టును చేతిలో పెట్టారేమో కానీ.. ఇప్పటి తరంలో అది అస్సలు కుదరదు. ఎందుకంటే రోజులు అలా వున్నాయి. ఇక ముకుంద సినిమా ఫ్లాపైనా కూడా.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హిట్ అవ్వడంతో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మీదున్న నమ్మకంతో బ్రహ్మోత్సవం సినిమా అతని చేతిలో సూపర్ స్టార్ మహేష్ బాబు పెట్టాడు.

అయితే టైమ్ బాలేదేమో.. ఇది బెడసి కొట్టేసింది. అందుకని ఇప్పుడు కుర్ర హీరోలు అసలు శ్రీకాంత్ కథ చెబుతానంటే కూడా వినడంలేదట. పైగా కథ విన్నాక కూడా నో అనేస్తున్నారట. ఇప్పటికే ఓ ఇద్దరికి కథ చెప్పిన శ్రీకాంత్ చాలా డిజప్పాయింట్ అయ్యాడని ఒక రూమర్ ఆల్రెడీ హల్ చల్ చేసేస్తోంది. మరి నిజంగానే శ్రీకాంత్ కథలో సత్తా లేదా లేకపోతే అతడి బ్రహ్మోత్సవం రిజల్టును చూసి కంగారుపడుతున్నారా అనే విషయం మాత్రం తెలియదు. ఇకపోతే కరక్టు కథతో వస్తే సినిమా చేయడానికి రెడీ అంటూ ఇద్దరు మెగా హీరోలు ఇప్పటికే శ్రీకాంత్ కు మాటిచ్చారని ఆయన సన్నిహితులు తెలియజేస్తున్నారు.

సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే, ఇలాంటి అవమానాలు కూడా భరించాలి మరి. శ్రీకాంత్ కి మళ్లీ మంచి రోజులు వస్తాయని అతని సన్నిహితులు ధీమాగానే చెబుతున్నారు.

English summary

Srikanth Addala is waiting for offers