ప్రమాదకర ప్లేస్ కి డ్రైవ్ చేస్తూ వెళ్లిన హీరో శ్రీకాంత్

Srikanth driving at most dangerous Ghat Road

10:46 AM ON 4th July, 2016 By Mirchi Vilas

Srikanth driving at  most dangerous Ghat Road

వంద సినిమాలకు పైగా నటించి, ఇంకా నటిస్తూ , తాజాగా తన కొడుకుని హీరోగా ఎంట్రీ ఇప్పిస్తున్న ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే హీరో శ్రీకాంత్ పైకి చాలా సాఫ్ట్ గా కనిపించినా, సాహస కృత్యాలు చేయాలనే కోరిక బలంగానే ఉన్నోడు. అందుకేనేమో ఎంతోకాలంగా అనుకుంటున్న లాంగ్ రోడ్ డ్రైవ్ కోరిక ఈ నెలలో తీర్చుకున్నాడు. తన చిన్ననాటి స్నేహితులు నలుగురుతో కలిసి శ్రీకాంత్ జున్ 17న హిమాలయాలకు రోడ్ ట్రీప్ బయలుదేరి పది రోజుల్లో ఆరు వేల కిలోమీటర్లు చుట్టి వచ్చాడు. ఢిల్లీ, శ్రీనగర్ మీదుగా కార్గిల్ కు వెళ్ళి... అక్కడి అమరవీరుల సమాధి దగ్గర శ్రీకాంత్ నివాళులు అర్పించాడు. అతి ప్రమాదకరమైన ఘాట్ రోడ్ లో శ్రీకాంత్ ఓన్ డ్రైవింగ్ చేసుకుంటూ ప్రయాణం సాగించారు. మోటర్ వాహనాల ద్వారా ప్రయాణం చేయగల ప్రపంచంలోని ఎత్తైన ( 18380 అడుగులు) ప్రదేశం ఖర్దుంగ్లాను శ్రీకాంత్ మిత్ర బృందం దర్శించింది. అదే దారిలో సెకండ్ హయ్యెస్ట్ పాస్ ఆఫ్ ద వరల్డ్ టగ్లాంగలానూ వీరు చూసొచ్చారు. లడక్ నుండి లే కు వెళ్ళి... అక్కడ నుండి మనాలి మీదగా హైదరాబాద్ చేరాడు. చిరకాల కోరిక తీరిపోయినందుకు ఆనందంగా ఉన్నా... ఆ పది రోజుల ఘాట్ రోడ్ ట్రిప్ ను తలుచుకుంటే, ఇప్పుడు భయం కలుగుతోందని శ్రీకాంత్ నవ్వుతూ చెబుతున్నాడు. ఓ మై గాడ్ శ్రీకాంత్ ఎంత సాహసం చేసి వచ్చాడో అంటూ అభిమానులు కామెంట్స్ పెట్టేస్తున్నారు.

ఇది కూడా చూడండి: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం

ఇది కూడా చూడండి: పేరు లో మొదటి అక్షరం ఏం చెప్తుంది ?

ఇది కూడా చూడండి: స్త్రీలు చేసేవి చేయకూడనివి

English summary

Srikanth driving at most dangerous Ghat Road