డిసెంబర్ లో 'వీడికి దూకుడెక్కువ'

Srikanth movie Veediki Dookudekkuva releasing on December

07:24 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Srikanth movie Veediki Dookudekkuva releasing on December

ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ఈ మధ్య మంచి హిట్లు లేక శతమతమైపోతున్నాడు. తాజాగా శ్రీకాంత్ నటించిన చిత్రం 'వీడికి దూకుడెక్కువ'తో మళ్లీ ఫామ్లోకి వస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు. శ్రీకాంత్, కామ్నజత్మలాని హీరోహీరోయిన్లుగా సత్యనారాయణ ద్వారపూడి దర్శకత్వం వహించిన చిత్రం 'వీడికి దూకుడెక్కువ'. పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై శ్రీమతి బి.సుధారెడ్డి సమర్పణలో, బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి స్వర్గస్తులైన చక్రి సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ మా హీరో శ్రీకాంత్ కి అన్ని అంశాల్లో కరెక్ట్గా సరిపోయే చిత్రం 'వీడికి దూకుడెక్కువ'.

ఇందులో పాటలు, ఫైట్స్, ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీ అన్ని సరిగ్గా సరిపొయిన విందు భోజనంలా ఉంటుంది ఈ సినిమా. దీనితో పాటు కామ్నజత్మలానీ అందచందాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అని చెప్పారు. అన్ని హంగులు పూర్తి చేసుకుని డిసెంబర్ 4న ఈ చిత్రం విడుదలవుతుంది.

English summary

Srikanth movie Veediki Dookudekkuva releasing on December. In this movie Kamna Jatmalani is pairing with srikanth.