శ్రీకాంత్ ఇంక సినిమాల్లో నటించడు!!

Srikanth says good bye to movies

10:18 AM ON 29th January, 2016 By Mirchi Vilas

Srikanth says good bye to movies

ఫ్యామిలీ హీరో గా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్. మహాత్మా చిత్రంతో 100 సినిమా లు పూర్తి చేసుకున్న శ్రీకాంత్ ఆ తరువాత తన జోరు ని కొనసాగించలేక పోయాడు. తను చేసిన సినిమా లన్నీ అట్టర్ ఫ్లాప్ కావడమే దీనికి కారణం. ఇప్పుడు తను చేస్తున్న సినిమా లన్నీ ఆగిపోయాయి. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశాలు లేవు. అయితే శ్రీకాంత్ హీరోగా తాజాగా నటిస్తున్న చిత్రం 'మెంట‌ల్ పోలీస్'. బాబ్జీ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఇటీవలే విడుదల చేశారు. మెడ‌లో చెప్పుల‌దండ వేసుకొన్న శ్రీ‌కాంత్ పోస్ట‌ర్ ఆసక్తి గానే ఉంది. ఖ‌డ్గం, ఆప‌రేష‌న్ దుర్యోధ‌న‌ తరువాత శ్రీ‌కాంత్ చేసిన ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర ఇదే అంటూ ప‌బ్లిసిటీ బాగానే ఇస్తున్నారు.

ఇప్పుడు శ్రీ‌కాంత్ ఆశ‌ల‌న్నీ ఈ చిత్రం పైనే ఉన్నాయి. ఒక‌వేళ ఈ చిత్రం ఫ్లాప్ అయితే శ్రీ‌కాంత్ హీరోగా శాశ్వ‌తంగా దూర‌మైపోయిన‌ట్టే. ఎందుకంటే శ్రీ‌కాంత్ సినిమాల‌కు ఇప్పుడు మార్కెట్ చాలా దారుణంగా ప‌డిపోయింది. శాటిలైట్‌ని న‌మ్ముకొని సినిమాలు తీసే ప‌రిస్థితి కూడా లేదు. అందుకే శ్రీకాంత్ త‌న ద‌గ్గ‌రకు వ‌స్తున్న నిర్మాత‌ల‌కు శాటిలైట్ కూడా రాని నాతో సినిమా ఎందుకు అని మొహం మీదే చెప్పేస్తున్నాడ‌ట‌. అయితే ఇప్పుడు శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్‌ క‌థానాయ‌కుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 'నిర్మలా కాన్వెంట్' అనే చిత్రంలో నటిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

రోషన్ ఎంట్రీ ఇస్తున్న సినిమా హిట్ అయితే శ్రీ‌కాంత్ హీరోగా ఇంక నటించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కానీ ఒకవేళ 'మెంట‌ల్ పోలీస్' ఏమాత్రం హిట్ అయినా శ్రీ‌కాంత్ మళ్లీ ఫాంలోకి వచ్చినట్టే.

English summary

Srikanth says good bye to movies because his movies are getting flop and he don't have any market in public now. Srikanth latest upcoming movie is Mental Police. If this movie is hit then he will may be change his decision.