'పెళ్లి సందడి' రీమేక్ లో రోషన్

Srikanth son Roshan in Pelli Sandadi remake

12:56 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Srikanth son Roshan in Pelli Sandadi remake

1996లో ఫమిల్య్ హీరో శ్రీకాంత్ తో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు తెరకెక్కించిన 'పెళ్లి సందడి' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సి. అశ్వినిదత్, అల్లు అరవింద్ కలిసి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీకాంత్ సరసన దీప్తి భట్నాగర్, రవళి హీరోయిన్ లుగా నటించారు. యమ్.యమ్. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ప్రతి పాట సూపర్ హిట్టే. ఇప్పుడు ఈ చిత్రం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇప్పుడు ఈ చిత్రం రీమేక్ లో నటించబోతున్నాడట. అయితే దీని గురించి ఇంకా అధికారికంగా ప్రకటించ లేదు.

రోషన్ ప్రస్తుతం నిర్మలా కాన్వెంట్ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో జై చిరంజీవ లో చిరంజీవికి మేన కోడలు గా నటించిన శ్రేయ శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలో నాగార్జున నిర్మిస్తున్నారు. అంతే కాదు ఈ చిత్రంలోని ఒక పాటను సంగీత దిగ్గజం ఏ.ఆర్. రెహ్మాన్ తనయుడు అమీన్ ఒక పాట కూడా ఆలపించాడు. త్వరలోనే మన ముందుకు రాబోతున్న ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విడుదలయ్యి మంచి టాక్ ను రప్పించుకుంది.

English summary

Srikanth son Roshan in Pelli Sandadi remake. Srikanth's one of the block buster movie Pelli Sandadi movie want to remake with his son Roshan. Now he is acting as a hero in Nirmala Convent movie.