స్టేజ్ పైనే కన్నీరు పెట్టుకున్న రోషన్.. ఏమైంది?

Srikanth son Roshan weep on stage

05:20 PM ON 9th September, 2016 By Mirchi Vilas

Srikanth son Roshan weep on stage

ఫ్యామిలీ చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయమవుతున్న తొలి చిత్రం 'నిర్మలా కాన్వెంట్'. నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నాగార్జున ఓ ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నిన్న పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకపై హీరో రోషన్ కన్నీరు పెట్టుకున్నాడు. తన తల్లిదండ్రులు గర్వపడేలా, తలఎత్తుకునే విధంగానే అందరితో నడుచుకుంటానని, ప్రేక్షకదేవుళ్ళు ఆదరించేవిధంగానే ఉంటానని రోషన్ ఎమోషనల్ గా మాట్లాడాడు. రోషన్ ఎమోషనల్ స్పీచ్ కు శ్రీకాంత్-ఊహలు కూడా ఎమోషనల్ అయ్యారు.

అనంతరం అందరూ రోషన్ పై పొగడ్తల వర్షం కురిపించడం, అక్కడి అభిమానుల నుంచి ఎక్కువ రెస్పాన్స్ రావడంతో రోషన్ ఆనందంతో కన్నీటి పర్యాంతం అయ్యాడు. నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే నా తల్లిదండ్రులే కారణం. యాక్టర్ అవుతానన్నప్పుడు, కళ్లు పైకే చూస్తుండాలి.. కాళ్లు కిందే ఉండాలన్నారు. అమ్మానాన్న తలెత్తుకునేలా ఉంటాను అన్నారు. ఇంకా నాగార్జున మాట్లాడుతూ... '75 సంవత్సరాల క్రితం ఘంటసాల బలరామయ్యగారు మా నాన్నగారిని(అక్కినేని నాగేశ్వరరావు) చూసి, కుర్రాడు బాగున్నాడే చలాకీగా.. అనుకుని యాక్టర్ ని చేశారు. ఆయన నాన్నగారికి అవకాశం ఇచ్చి ఉండకపోతే మేం ఎక్కడుండేవాళ్లమో? ఏం చేసేవాళ్లమో?' ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలనీ, కొత్తవారిని ప్రోత్సహించాలని నాన్నగారు చెప్పేవారు. ఆయన స్ఫూర్తితో ముందుకెళుతున్నాం అన్నారు నాగార్జున.

ఇది కూడా చదవండి:మరణానికి ముందు యమధర్మరాజు ఈ 4 సూచనలు పంపుతాడట

ఇది కూడా చదవండి:ఇలా చేస్తే రెండు రోజుల్లోనే బట్టతల పై హెయిర్ రీగ్రోత్ మొదలవుతుంది

ఇది కూడా చదవండి:ఈ దేశాలలో మన రూపాయి విలువ చాలా ఎక్కువ

English summary

Srikanth son Roshan weep on stage. Srikanth's son Roshan cried on Nirmala Convent audio function stage.