26నే 'టెర్రర్'

Srikanth Terror Movie release date

10:16 AM ON 20th February, 2016 By Mirchi Vilas

Srikanth Terror Movie release date

కెరీర్ మొదట్లో విలన్ తరహా పాత్రలతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్ ఇప్పుడు తనయుడుని రంగంలో దింపుతున్నాడు. ఇక కొద్దికాలం విరామం తర్వాత శ్రీకాంత్ పూర్తి స్థాయి హీరోగా నటించిన ‘టెర్రర్’ అనే సినిమాను ఫిబ్రవరి 26న విడుదల చేయాలని తాజాగా నిర్ణయించారు. హోప్’ అనే సినిమాకు గానూ జాతీయ అవార్డు పొందిన దర్శకుడు సతీష్ కాశెట్టి తెరకెక్కించిన ‘టెర్రర్’ సినిమా, ఓ సరికొత్త పోలీసోడి కథగా ప్రచారం పొందుతోంది. వాస్తవానికి ఈ సినిమాని మార్చి 4వ తేదీన విడుదల చేస్తున్నట్లు దర్శక, నిర్మాతలు ఇంతకుముందే ప్రకటించేశారు. అయితే అదేరోజు మూడు ఇతర క్రేజ్ ఉన్న సినిమాలు కూడా విడుదల అవుతున్నందున టెర్రర్ టీమ్ తాజాగా తమ సినిమాను ఒక వారం ముందే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఫిబ్రవరి 26న టెర్రర్ సినిమా విడుదల కానుందని స్పష్టమైంది. ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్న నమ్మకాన్ని శ్రీకాంత్ వ్యక్త పరుస్తున్నాడు. కాగా సంక్రాంతి సినిమా హడావుడి పూర్తిగా తగ్గిపోవడంతో గత కొద్దికాలంగా సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్న సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి.ఇక వేసవిలో వరుస సినిమాలే సినిమాలు ....

English summary

Hero Srikanth's new film Terror was going to be released on February 26th.Previously this movie unit announced that this movie was going to be released on March 4th but it has been preponed to February 26th.This movie was directed by Satish Kaasetti